వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోని బుల్లిరాజు( Bulliraju ) పాత్ర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అనిల్ రావిపూడి( Anil Ravipudi ) వెంకటేశ్( Venkatesh ) కాంబినేషన్ లో ఈ సినిమా మూడో సినిమా కాగా కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా అదరగొట్టిందనే చెప్పాలి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ కు బుల్లిరాజు పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు.
సినిమా ఫస్టాఫ్ లో ఈ పాత్ర చేసిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది.
అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో బుల్లిరాజు పాత్రలో నటించిన రేవంత్( Revanth ) మాట్లాడుతూ నాలా ఓటీటీలు చూసి ఎవరూ పాడైపోవద్దని అన్నారు.
ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే సినిమా అలా చేశామని రేవంత్ వెల్లడించారు. """/" /
ఈ సినిమాలో నా పాత్రను ఎవరూ ఫాలో కావద్దని అందుకు మీ అందరికీ సారీ అని అన్నారు.
మీ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదని అందరితో బాగా కలిసిపోయానని రేవంత్ కామెంట్లు చేశారు.
వెంకటేశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిలిచే ఛాన్స్ ఉంది.
ఈ సినిమా ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
"""/" /
మరోవైపు రేవంత్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ రెమ్యునరేషన్ సైతం పెరుగుతోంది.బుల్లిరాజు పాత్ర కోసమే సినిమాను కొంతమంది ప్రేక్షకులు మళ్లీమళ్లీ చూస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇండస్ట్రీకి కొత్త కళను తెచ్చిందని చెప్పవచ్చు.2025 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతమేర కలిసొస్తుందో చూడాల్సి ఉంది.
భోజనానికి ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగితే ఏం అవుతుందో తెలుసా?