సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆ రోల్ ను రిజెక్ట్ చేశారట.. పాపం ఇప్పుడు బాధ పడుతుంటారు!

టాలీవుడ్ హీరో వెంకటేష్(Venkates) తాజాగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి(Aishwarya Rajesh, Meenakshi Chowdhury) లు హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.

విడుదలైన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద 45 కోట్లకు పైగా వసూళ్లను సాధించి వెంకటేష్ కెరియర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన అద్భుతం అని చెప్పాలి.

సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ విక్టరీ వెంకటేష్ అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ల నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ముఖ్యంగా వెంకటేష్ భార్య భాగ్యం పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)సినిమా విజయంలో కీ రోల్ పోషించింది.

అయితే ఈ పాత్ర తన దగ్గరికి రావడానికి ముందో మరో ముగ్గురు హీరోయిన్లు రిజెక్ట్ చేసినట్లు ఐశ్వర్య తాజాగా తెలిపింది.

సినిమాలో మన మధ్యలోకి ఎవరొస్తారు బా.అంటూ పక్కా గోదారి యాసలో మాట్లాడుతూ థియేటర్లలో నవ్వులు పూయియింది ఐశ్వర్య రాజేష్(aishwarya Rajesh).

మూవీలో వెంకటేష్(Venkatesh) భార్య అయిన భాగ్యం పాత్రలో అద్భుతంగా నటించింది ఐశ్వర్య.సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య సినిమాలో భాగ్యం క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.

నిజానికి ఈ పాత్ర నా దగ్గరికొచ్చే ముందే ముగ్గురు హీరోయిన్లు రిజెక్ట్ చేశారు.

ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి నాతో ముందే చెప్పారు. """/" / నలుగురి పిల్లల తల్లి పాత్ర కావడంతోనే వాళ్లు రిజెక్ట్ చేసినట్లు అనిల్ చెప్పారు.

కానీ నాకు అది పెద్ద ఇష్యూ అనిపించలేదు.ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకడం నిజంగా నా భాగ్యం.

ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్లు బాధపడతారు అని ఐశ్వర్య చెప్పింది.

అయితే ఈ పాత్రని ఎవరు రిజెక్ట్ చేశారనే విషయం మాత్రం ఐశ్వర్య చెప్పలేదు.

కానీ నెటిజన్లు మాత్రం కాజల్, తమన్నా రిజెక్ట్ చేసి ఉంటారంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎందుకంటే కాజల్‌ తో రీసెంట్‌ గా భగవంత్ కేసరి సినిమా చేశారు అనిల్ రావిపూడి.

అలానే తమన్నాతో F2, F3 చిత్రాలు చేశారు.కనుక వాళ్లిద్దరే రిజెక్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు.

ఇంకొంతమంది అయితే నిత్య మీనన్ రిజెక్ట్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

తేజ ఏం సినిమా చేస్తున్నాడు…రానా మూవీ ఆగిపోయిందా..?