సంక్రాంతి సినిమాల ఓటీటీ డీల్స్ వివరాలు ఇవే.. ఏ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?

తాజాగా సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) సందర్భంగా చాలా సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా అందులో గేమ్ చేంజర్,( Game Changer ) డాకు మహారాజ్,( Daaku Maharaaj ) సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమా పేర్లు ఎక్కువగా వినిపించాయి.

ఈ సినిమాలన్నీ కూడా కేవలం రెండే రెండు రోజుల గ్యాప్ తో వరుసగా విడుదలైన విషయం తెలిసిందే.

ఇందులో గేమ్ చేంజర్ తప్ప మిగతా రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.

ఇకపోతే తాజాగా సంక్రాంతికి విడుదలైన సినిమాల ఓటీటీ( OTT ) డీల్స్ కూడా బయటకొచ్చాయి.

మరి ఏ ఏ సినిమా ఎక్కడ ఎప్పుడు విడుదల కానుంది అన్న విషయానికి వస్తే.

రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ఓటీటీ డీల్ చాన్నాళ్ల కిందటే క్లోజ్ అయింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంది.

అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది అన్న విషయాన్ని మాత్రం చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు.

ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న స్పందన బట్టి చూస్తుంటే ఈ సినిమా త్వరలోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

"""/" / ఇకపోతే డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరోగా నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో నెట్ ఫ్లిక్స్ జనాలకు గట్టి అనుబంధం ఉంది.

అందులో భాగంగానే ఈ సినిమా ఓటీటీ డీల్ లాక్ అయింది.తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

సినిమా విడుదల అయ్యినాలుగు 3 రోజులు అవుతున్నా కూడా థియేటర్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

"""/" / ఇకపోతే వెంకటేశ్( Venkatesh ) హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం.

అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ నిన్న మొన్నటివరకు లాక్ అవ్వలేదు.ఎందుకంటే, ఆఖరి నిమిషంలో సంక్రాంతి బరిలోకి దిగడం, ఓటీటీ లన్నీ అప్పటికే తమ షెడ్యూల్స్ ఫిక్స్ చేయడంతో, ఈ సినిమాకు లాస్ట్ మినిట్ వరకు డిజిటల్ రైట్స్ లాక్ అవ్వలేదు.

ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ5 తీసుకుంది.శాటిలైట్ రైట్స్ కూడా వాళ్లవే అని తెలుస్తోంది.

ఇలా సంక్రాంతి సినిమాల్ని అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5 దక్కించుకున్నాయి.ఈ 3 చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ముందుగా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

బాలయ్య పై ముద్దుల వర్షం కురిపించిన టాలీవుడ్ హీరో…. ఏదో తేడాగా ఉందంటున్న నేటిజన్స్?