జనసేనలో 'సంక్రాంతి' సందడి ! అప్పటి నుంచీ ....

ఎన్నికల సమయం అతి సమీపానికి వచ్చేస్తుండడంతో ఏపీలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి.

వరుస పర్యటనలు.సభలు.

సమావేశాలతో ఏపీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.ఒకవైపు .

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పేరుతో.రాష్ట్రమంతా దాదాపు చుట్టేశారు.

ఆ తరువాత .బస్సు యాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇలా ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండేలా వైసీపీ ప్లాన్ చేసుకుంది.అదే స్పీడ్ తో పార్టీలో ప్రక్షాళన కూడా .

చేస్తూ.సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని జగన్ స్పీడ్ పెంచాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇక ఈ విషయంలో టీడీపీ కూడా హడావుడిగానే ఉంది.

తాజాగా చంద్రబాబు సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులకు గట్టిగానే క్లాస్ పీకి స్పీడ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాగే ఇక నాయకులంతా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండేలా .ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ప్రధానంగా మిగిలింది జననసేన పార్టీ మాత్రమే.సీఎం కుర్చీ కోసం జనసేనాని కూడా ఆరాటపడుతుండడంతో.

ఏపీ అంతా ప్రచారాలతో స్పీడ్ పెంచేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నాడు.ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటన కూడా పూర్తి చేసుకొచ్చాడు.

అక్కడ రాజకీయంగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని, ఇక ఎన్నికల ప్రచారం రాజధాని నుండి అంటూ ట్వీట్ చేశారు.

ఇక నాయకుల అందరికి ఆయన అమరావతిలోనే అందుబాటులో ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసారు.జనవరిలో సంక్రాంతి పండగ నుంచి ఏపీ రాజధానిలోనే అందరికీ అందుబాటులో ఉండేలా పవన్ ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

ఈ మేరకు జనవరి మొదటి వారం నుంచే పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయి పర్యటనలతో పాటుగా, నాయకులకు పూర్తి స్థాయిలో అందుబాటులో అమరావతిలో ఉండబోతున్నట్టు పవన్ ట్వీట్ చేశారు.

అలాగే.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పై కూడా పూర్తిస్థాయి కసరత్తు చేసేందుకు పవన్ దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అక్కడి నుండే ఎన్నికల బరిలోకి కూడా.అమరావతి కేంద్రంగా పవన్ రాజకీయాలు నడపాలని నిర్ణయించుకున్నారు.

ఇందుకోసమే తాడేపల్లి సమీపంలోనే జనసేన కార్యాలయం, నివాసం సిద్ధం చేసుకున్నారు.జనవరి నుండి క్షేత్రస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నట్టు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి లో రానుండటంతో, పార్టీలో చేరేవారిని అమరావతి వేదికగా ఆహ్వానించనున్నారు.

అలాగే అన్ని జిల్లాలలో పర్యటనలకు కార్యాచరణ ఖరారు చేశారు.ఇక ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ఇప్పటికే రాజధాని నుండే రాజకీయాలు నడుపుతుంటే, ఆ దారిలోనే జనసేన కూడా ముందుకు వెళుతోంది.

రండి.గెలిచి కొత్త తరాన్ని నిలబెడదాం.

నిలిచి కొత్త బావుటా ఎగరేద్దాం.కలసి కొత్త శకాన్ని సృష్టిద్దాం’ అని శుక్రవారం ట్విటర్‌లో జనసేనాని పిలుపు కూడా ఇచ్చారు.

పేదరికంతో పోరాటం చేస్తూ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!