ఏపీ సచివాలయ ఉద్యోగుల సంక్రాంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆవరణలో ఘనంగా జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అద్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మరియు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.

జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్దిచేకూర్చే విధంగా పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు కావడమే కాకుండా రాష్ట్రం మరింత పురోగతిని సాధిస్తుందనే ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జు నకు , రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అద్యక్షుడు వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు.

సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా సంస్కృతి, సాంప్రదాయాలు అద్దంపట్టే విధంగా జానపద కళలైన కర్రసాము, కత్తి సాములతో కళాకారులు, పలు రకాల రంగవల్లులతో మహిళా ఉద్యోగినులు, హరిదాసు, గంగిరెద్దులు, సన్నాయి, మేళతాళాల మధ్య యెడ్ల బండిలో మంత్రులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఉద్యోగులు వారిని ఘనంగా సత్కరించారు.

సచివాలయ ఉద్యోగుల సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళా ఉద్యోగినులకు రంగవల్లుల పోటీలు, ఉద్యోగులకు కబడ్దీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.

అదే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటలు, పాటల పోటీలను కూడా ఈ వేడుల్లో భాగంగా నిర్వహించడం జరిగింది.

ఆంద్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొని సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందుగానే సచివాలయంలో సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తలపించారు.

సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

నారా బ్రాహ్మణికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందా… అందుకే వద్దనుకున్నారా?