ఇంతకు సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎన్ని.. రాని సినిమాలు ఏవి?

టాలీవుడ్ ప్రేక్షకులు సంక్రాంతి సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం లో అనూహ్యంగా వస్తామన్న రెండు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా వాయిదా వేసినట్లుగా అధికారికంగా ప్రకటించగా.రాధే శ్యామ్‌ సినిమా ను కూడా వాయిదా వేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు చేస్తాయి.ఈ రెండు సినిమా లు తెలుగు సినిమా స్థాయిని పెంచుతాయి అనుకుంటూ ఉండగా అనూహ్యంగా రాధేశ్యామ్‌ సినిమా విడుదల వాయిదా పడింది.

ఇదే సమయంలో ఆర్ ఆర్‌ ఆర్‌ వాయిదా విషయం అభిమానుల ను తీవ్రంగా కలచి వేసింది.

అయితే ఇక్కడ ఒక ఆనందించాల్సిన విషయం ఏంటీ అంటే ఆ రెండు సినిమాలు విడుదల వాయిదా పడ్డా సంక్రాంతి సందడి మాత్రం కంటిన్యూ అవ్వబోతుంది.

ఉత్తరాదిన ఎక్కువ వసూళ్లను ఆశిస్తున్న ఆ సినిమా లు వాయిదా పడ్డాయి.కాని కేవలం తెలుగు ఆడియన్స్ టార్గెట్ గా రాసిన సినిమా లు మాత్రం పెద్దగా ఎఫెక్ట్‌ అవ్వవు.

అందుకే తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ లో విడుదల అయ్యేలా భీమ్లా నాయక్‌.

బంగార్రాజు.రౌడీ బాయ్స్ మరో రెండు మూడు చిన్న చితక సినిమా లు కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.

"""/" / సంక్రాంతికి ముఖ్యంగా బంగార్రాజు మరియు భీమ్లా నాయక్ సినిమాల రచ్చ కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి సందర్బంగా రాబోతున్న సినిమాలు మరియు వాయిదా పడ్డ సినిమాల విషయాలు మరింత క్లారిటీ గా సోమవారం వరకు వచ్చే అవకాశం ఉంది.

భీమ్లా నాయక్‌ విడుదలకు అవకాశం ఉందా.ప్రమోషన్స్ చేస్తారా అనేది చూడాలి.

ఇక బంగార్రాజు ను అధికారికంగా సంక్రాంతి కి అంటూ ప్రకటించారు.

ఇదేందయ్యా ఇది.. పైకి పాకుతున్న నది నీరు.. వీడియో చూస్తే నమ్మలేరు..