సంకష్టహర చతుర్థి రోజు.. ఇలా చేస్తే అప్పులన్నీ మాయం..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజల సంపాదన లక్షల్లో ఉన్నప్పటికీ అప్పులు కుప్పలుగా ఉంటున్నాయి.

వారు కావాలని చేయకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో విపరీతంగా అప్పులు పెరిగిపోతూ ఉంటాయి.అయితే వాటిని తీర్చడం ఎంతో కష్టంగా మారిపోతుంది.

కొన్ని సంవత్సరాల పాటు ఎన్ని డబ్బులు కట్టిన అప్పులు మాత్రం అలాగే ఉంటాయి.

అయితే వాటిని అప్పులు కట్టేసి జీవితం హాయిగా ఉండాలంటే ఈ పనులను కచ్చితంగా చేయాలి.

ముఖ్యంగా సంకష్టహర చతుర్థి( Sankashtahara Chaturthi ) రోజు ఈ పనులు చేశారంటే అప్పులన్నీ దూరమైపోతాయి.

"""/" / తిథుల్లో అత్యంత ప్రీతికరమైనది సంకష్టహర చతుర్థి.దీన్నే సంకట హర చతుర్థి అని కూడా అంటారు.

ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తూ ఉంటుంది.అప్పుల బాధ నుంచి విముక్తి కోసం సంకష్టహర చతుర్థి రోజు సాయంత్రంలోగా ఈ ఒక్క పని చేయాలి.

సంకష్టహార చుతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో కుజ దోష సమస్యలు( Kuja Dosha Problems ) దూరం అయిపోతాయి.

అలాగే చేసే పనుల్లో మంచి జరుగుతుందని చెబుతున్నారు.ఈ సంకష్టహార చతుర్థి ప్రతినెల కృష్ణ పక్షం అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజులలో చవితి రోజు వస్తుంది.

ప్రదోష కాలంలో అంటే సూర్యోస్తమయం( Sunset ) ఏ సమయంలో ఉంటుందో ఆరోజు సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తారు.

"""/" / ఈ రోజున తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకొని అందులో ముడు గుప్పిట్ల బియ్యం పోసి రెండు ఎండు ఖర్జూరాలు, రెండు ఒక్కలు, అలాగే 11 లేదా 21 లేదా 51 లేదా 101 రూపాయలు పెట్టి ముడుపు కట్టాలి.

ఎన్ని నెలలు పూజ చేయాలనుకుంటే అన్ని నెలలు ఆ ముడుపుకు పూజ చేయాల్సి ఉంటుంది.

అలాగే ముడుపు పైన పూలు, ముడుపు కింద తమలపాకులు, అరటిపండు( Betel Leaves, Banana ) పెట్టి పూజించాలి.

ఆ తర్వాత నిత్య పూజా చేసుకుని గణపతి అష్టోత్తరం, శోడషోపచార పూజ చేసుకోవాలి.

అలాగే దగ్గర్లోని ఏదైనా ఒక దేవాలయానికి వెళ్లి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయాలి.

అలాగే గణపతికి గరికను కూడా సమర్పించాలి.వ్రతం ఆచరిస్తున్న సమయంలో ఉడికించిన ఆహారానికి దూరంగా ఉండాలి.

ఇలా చేయడం వల్ల మీ అప్పుల బాధ త్వరగా దూరమైపోతుంది.

బీజేపీ చేరాలంటే ఇన్ని కండిషన్లా ?  అందుకేనా కాంగ్రెస్ లోకి క్యూ ?