మ్యాచ్ ఓడిన ఓ అరుదైన రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ శాంసన్..!
TeluguStop.com
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి బంతి వరకు పోరాడి రాజస్థాన్ రాయల్స్ ఓటమిని ఖాతాలో వేసుకుంది.
అయితే మ్యాచ్ ఓడినా కూడా ఓ అరుదైన రికార్డు సృష్టించాడు రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసంగ్.
తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో 25 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ తో 42 పరుగులు చేశాడు.
మొన్నటి వరకు రాజస్థాన్ తరఫున ఆడి 3098 అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ఆజింక్య రహనే పేరిట ఉంది.
కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో సంజూ చేసిన 42 పరుగులు కలుపుకొని రాజస్థాన్ తరపున 3138 పరుగులు కావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు.
"""/" /
రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగుల చేసిన వారిలో సంజూ శాంసన్( Sanju Samson ) 3138 పరుగులతో మొదటి స్థానంలో, అజింక్య రహనే( Ajinkya Rahane ) 3098 పరుగులతో రెండో స్థానంలో, షేన్ వాట్సన్ 2474 పరుగులతో మూడో స్థానంలో, జోస్ బట్లర్ 2377 పరుగులతో నాలుగో స్థానాల్లో ఉన్నారు.
"""/" /
అయితే ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )పేరిట ఉంది.
224 మ్యాచ్లలో ఆడిన విరాట్ కోహ్లీ 6706 పరుగులు సాధించాడు.ఇందులో ఐదు సెంచరీలు, 45 అర్థ సెంచరీలు ఉన్నాయి.
ఒకే ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో మొదట విరాట్ కోహ్లీ ఉండగా, తరువాత సురేష్ రైనా, రోహిత్ శర్మ , ఏబీడీ, ధోని, డేవిడ్ వార్నర్, పోలార్డ్, క్రిస్ గేల్, గౌతమ్ గంభీర్, అజింక్య రహనే ఉన్నారు.
ఇక తాజాగా మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు( Punjab Kings ) 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.
రాజస్థాన్ జట్టు లక్ష్య చేదనలో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!