ఆ కన్నడ హీరో నాతో మిస్ బిహేవ్ చేశాడు.. సంజన సంచలన వ్యాఖ్యలు వైరల్!

సంజన గల్రానీ.( Sanjana Galrani ).

ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బుజ్జిగాడు.

ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది సంజన.

ఈ సినిమా మంచి హిట్ అయినప్పటికీ ఈమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు.

కానీ కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్గా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక కన్నడలో బిజీ అవుతున్న టైంలో సంజన డ్రగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించి తరువాత బెయిల్‌ మీద బయటకు వచ్చింది.

ఆ తరువాత ఆ డ్రగ్స్ కేసును కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. """/" / అయితే నిజానికి ఈ డ్రగ్స్ కేసు పంచాయతీ ( Drug Case Panchayati )నడుస్తున్నప్పుడే ఒక ముస్లిం డాక్టర్ ను పెళ్లి చేసుకోవడంతో ఆమె లవ్ జిహాదీ (Love Jihadi)బాధితురాలనే చర్చ కూడా జరిగింది.

అయితే ఆమె గతంలో ఒక తెలుగు ఇంటర్వ్యూలో కన్నడ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో సంజన మాట్లాడుతూ.కన్నడలో ఒక హీరో ఉన్నాడు, అతనితో నాకు టార్చర్ అయిపోయింది.

అతను ఫ్రస్ట్రేషన్ ఉన్న హీరో, అతని పేరు చెప్పను కానీ అతనితో నాకు ఒక సీన్ ఉంది.

డాన్స్ చేస్తున్నట్టు నా భుజాలు పట్టుకుని కదపాల్సి ఉంది.అతనికి డైరెక్టర్ కి గొడవ నడుస్తోంది.

యాక్షన్ చెప్పాక వచ్చి నా చేతి భుజాల వద్ద పట్టుకుని పిసికేశాడు, డ్యూడ్ ఇంత గట్టిగానా నాకు నొప్పిగా ఉంది అంటే ఓహ్, సారీ మేనేజ్ చేసుకో అన్నాడు.

"""/" / నేను ఇలా దెబ్బలు తినడానికి హీరోయిన్ గా రాలేదు.నిజానికి కొన్ని సార్లు ఇలాంటి క్రాక్ కాండేట్లు దొరుకుతారు అని సంజన చెప్పింది.

వెంటనే నేను మీతో ఒక అరగంట షూట్ చేయను, ఇదేమీ యాక్షన్ సీక్వెన్స్ కాదు.

నేనేమీ మీకు ఎదురుగా దొరికే రౌడీ కాదని చెప్పి వెళ్లిపోయానని సంజన కామెంట్ చేసింది.

అయితే ఆ హీరో ఎవరు? అనే విషయం మాత్రం ఆమె బయట పెట్టలేదు.

ప్రస్తుతం ఈ వాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ విదేశీ మహిళకు బుద్ధి లేదు.. కిరణ్ బేడీ వత్తాసు పలకడమే దారుణం?