కిష‌న్‌రెడ్డి కంటే సంజ‌య్ యాత్ర‌కే ఇంపార్టెన్స్‌.. మామూలుగా లేదుగా..

ఇప్పుడు తెలంగాణ‌లో వ‌రుస‌గా పాద‌యాత్ర‌ల జోరు సాగుతోంది.ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డి ఇందుకోసం ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇంకోవైపు తీన్మార్ మ‌ల్ల‌న్న కూడా భారీగానే 7200మూమెంట్ అంటూ పాద‌యాత్ర కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

ఇక పోతే త‌మ పార్టీని కూడా రాబోయే ఎన్నిక‌ల్లో అధికారంలోకి తీసుకురావ‌డే టార్గెట్ గా బండి సంజ‌య్ కూడా జ‌న సంగ్రామ యాత్ర‌కు తెర‌లేపారు.

ఇందుకోసం నిన్న పాతబ‌స్తీలోని భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి ఆల‌యం ద‌గ్గ‌రి నుంచి ఈ పాద‌యాత్ర‌ను ప్రారంభించారు.

కాగా నిన్న ఆయ‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా భారీగా ఏర్పాట్లు చేశారు.పార్టీలోని ప్రముఖులు అంద‌రూ కూడా ఈ యాత్ర‌కు వ‌చ్చారు.

ఢిల్లీ నుంచి త‌రుణ్ చుగ్ కూడా ఈ యాత్ర‌కు వ‌చ్చి సంఘీభావం తెలిపారు.

కాగా ఇంత‌కుముందు కిష‌న్‌రెడ్డి కూడా జ‌నాశీర్వాద యాత్ర‌ను చేప‌ట్టారు.అయితే దానికి అంత పెద్ద‌గా రెస్పాన్స్ రాలేద‌నే చెప్పాలి.

పార్టీలో ఉన్న ప్ర‌ముఖులు అంద‌రూ హాజ‌రు కాలేదు.దీంతో అప్ప‌టి నుంచే కిష‌న్‌రెడ్డి ఇమేజ్ బీజేపీలో త‌గ్గింద‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఇక నిన్న అది మ‌రోసారి స్ప‌ష్టంగా అర్థ‌మ‌యింది.ఎందుకంటే ఆయ‌న యాత్ర‌కు వేలాదిగా జ‌నం హాజ‌ర‌య్యారు.

పార్టీ ప్ర‌ముఖులు త‌ర‌లి వ‌చ్చి మ‌ద్ద‌తు తెలిపారు. """/"/ మొద‌టి నుంచి బీజేపీలో బండి సంజ‌య్ అలాగే కిష‌న్‌రెడ్డికి మ‌ధ్య వివాదం ఉన్న‌ద‌ని ప్ర‌చారం సాగుతున్న నేప‌థ్యంలో ఇలా ఇద్ద‌రు పోటీపోటీగా యాత్ర‌లు చేయ‌డంతో అది కాస్తా తేట‌తెల్లం అయింది.

అయితే కిష‌న్‌రెడ్డి ఆధిప‌త్యమే ఉంద‌ని అంతా భావిస్తున్న స‌మ‌యంలో ఇప్పుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు ఇంత రెస్పాన్స్ రావ‌డంతో అది ఏమీ లేద‌న్న‌ట్టు పార్టీ కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకుంటున్నారు.

కాగా పాద‌యాత్ర‌కు ముందు ముందు కూడా ఇంతే రెస్పాన్స్ ఉంటుందా లేక ఇక్క‌డికే ప‌రిమితం అవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

అందుకే ఫస్ట్ హాఫ్ స్లోగా తీసాం.. ట్రోల్స్ పై నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!