‘డబుల్ ఇస్మార్ట్’లో ఆ బాలీవుడ్ స్టార్.. ఎవరంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni ) ఇష్మార్ట్ శంకర్( ISmart Shankar ) సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఇద్దరు సాలిడ్ హిట్ అందుకుని భారీ క్రేజ్ తెచ్చుకున్నారు.

కెరీర్ లో వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సమయంలో ఇద్దరికీ కూడా ఈ సినిమా హిట్ పెద్ద బూస్ట్ ఇచ్చింది.

"""/" / ఇక నాలుగేళ్ళ తర్వాత వీరి కాంబోలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని ఇటీవలే మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.

''డబుల్ ఇస్మార్ట్'తో ఈ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అంటూ ప్రకటించారు.

ప్రకటించిన కొద్దిరోజులకు ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేసారు.జులై 12 నుండి రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ అయ్యింది.

"""/" / ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.

ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుండగా ఇందులో ఒక ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలని పూరీ ఆలోచిస్తున్నారట.

మరి ఈ స్టార్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.

ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ కానుండగా ఛార్మి కౌర్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పై విష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి పూరీ ఈసారి లైగర్ ను మరిపించే హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా రామ్ ప్రస్తుతం బోయపాటితో 'స్కంద' సినిమా చేస్తున్నాడు.శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నారు.

అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మహేష్ వాయిస్ వల్ల ముఫాసాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు .. సూపర్ స్టార్ రేంజ్ ఇదే!