పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంజన గల్రాని.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమా గురించి మనందరికీ తెలిసిందే.

బుజ్జిగాడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ సంజనా గల్రానీ.మొదటి సినిమాతోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది సంజన.

సంజనా గల్రానీ గత ఏడాది ఏప్రిల్లో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

ఈమె కి కర్ణాటకకు చెందిన డాక్టర్ షాషాను పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న సంజన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే పెళ్లి అయిన తర్వాత తాను గర్భవతి అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఇటీవల ఆమె స్నేహితులు ఆమెకు సీమంతం చేయగా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది.

దీంతో అభిమానులు ఆ ఫోటోలు చూసి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.ఇదిలా ఉంటే తాజాగా సంజన అభిమానులకు మరొక శుభవార్త తెలిపింది.

ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడించింది.

"""/"/ దీంతో అభిమానులు సంజన కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే తాజాగా సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ కి హీరో ఆది పినిశెట్టి తో కలిసి చెన్నైలో సాంప్రదాయబద్దంగా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.

అయితే సంజనా కూడా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఆ తరువాత తాను ఎందుకు రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఆ విషయాన్ని కూడా వివరించింది.

పెళ్లి తరువాత డ్రగ్స్ కేసు విషయంలో మూడు నెలలు జైలులో గడిపి అనంతరం బెయిల్ పై బయటకు వచ్చి పెళ్లి చేసుకుంది.

కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?