సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారా…!

సానియా మిర్జా, షోయబ్ మాలిక్ సెలబ్రిటీ స్టార్ కపుల్.వీరి ప్రేమ దేశాలు దాటి సరిహద్దులు దాటి గెలిచింది.

2010లో వీరి వివాహం ఘనంగా జరిగింది.2018లో ఈ జంటకు ఓ మగబిడ్డ కూడా పుట్టాడు.

అయితే ఇప్పుడు వీరి వైవాహిక జీవితం ప్రమాదంలో పడిందా? గతకొన్నాళ్లుగా సానియా, షోయబ్ వేర్వేరుగా ఉంటున్నారా ? సానియా మీర్జా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్టార్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణులలో కూడా ఒకటి.

డబుల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌-1గా నిలిచింది.ఆమె ఖాతాలో 6 డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయ్.

మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-100కి చేరుకున్న ఏకైక భారతీయురాలు.2007లో సానియా 27వ ర్యాంకుకు చేరుకుంది.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని ప్రేమించి పెళ్లాడింది.

2010లో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీ కపుల్ డైవర్స్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది.

2009లో హైదరాబాద్‌కి చెందిన తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ మహ్మద్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది సానియా మీర్జా.

యూనివర్సల్ బేకర్స్ వారసుడైన మహ్మద్‌తో పెళ్లి దగ్గరపడుతున్న సమయంలో ఈ ఇద్దరూ మనస్పర్థలతో ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు.

"""/"/ ఆ తర్వాతి ఏడాదే షోయబ్ మాలిక్‌ని పెళ్లాడింది సానియా మీర్జా.12 ఏళ్లుగా ఈ ఇద్దరి మధ్య వైవాహిక జీవితం సజావుగానే సాగుతోంది.

భారత్‌లో 120 కోట్ల మంది జనాభా ఉంటే, పెళ్లి చేసుకోవడానికి పాకిస్తానీయే దొరికాడా? అంటూ కామెంట్లు చేశారు భారత అభిమానులు.

ఈ ట్రోలింగ్‌ని తట్టుకోలేక భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడల్లా కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చింది సానియా మీర్జా.

పాక్ క్రికెటర్‌ను పెళ్లాడిన తర్వాత సానియా మీర్జాని తీవ్రంగా ట్రోల్ చేస్తూ, ఆమెను పాకిస్తానీగా అభివర్ణిస్తూ దూషణలు చేసేవాళ్లు నెటిజన్లు.

"""/"/ పాకిస్తాక్ క్రికెటర్లంటే భారతీయులకు అస్సలు పడదు.అయితే అంతో కొంతో భారతీయులు ప్రేమాభిమానులు చురగొన్న పాక్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది షోయబ్ మాలిక్.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని పెళ్లాడక ముందే, భారత క్రికెటర్లతో సన్నిహితంగా ఉండేవాడు షోయబ్ మాలిక్.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా అనే కొడుకు పుట్టాడు.

కొడుకు పుట్టిన తర్వాత ఏడాదిన్నరకు పైగా టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా మాలిక్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియా తరుపున ప్రాతినిథ్యం వహించింది.

"""/"/ 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్న సానియా మీర్జా గాయంతో తప్పుకోగా, టోక్యో ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌లో ఓడింది .

2022 సీజన్‌తో టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.పెళ్లైన తర్వాత యూఏఈకి మకాం మార్చిన షోయబ్ మాలిక్, సానియా మీర్జా జంట ప్రస్తుతం అక్కడే ఉంటోంది.

కొన్నాళ్లుగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ మధ్య సంబంధాలు చెడిపోయాయని, ప్రస్తుతం భారత మాజీ టెన్నిస్ స్టార్ వేరుగా ఉంటోందని వార్తలు వస్తున్నాయి.

ఈ ఇద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ ఇద్దరూ విడాకులు తీసుకునే ప్రసక్తి లేదని, ఇది ఏదో పుకారు అయి ఉంటుందని కొట్టి పారేస్తున్నారు కొందరు అభిమానులు.

ఒకవేళ విడాకుల వార్త నిజమైతే మాత్రం పాక్ క్రికెటర్‌ని పెళ్లాడినందుకే సానియా మీర్జా మరిన్ని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఒక వంద గుమ్మడికాయలతో దిష్టి తీయించుకోండి… అల్లు అర్జున్ పై వేణు స్వామి భార్య కామెంట్స్!