ఇండస్ట్రీ నాకేం జీవితాన్ని ఇవ్వలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సంగీత!

సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సంగీత( Sangeetha )ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే ఈమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.అయితే ప్రస్తుతం తిరిగి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా నటిగా పలు సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీతం తమిళ చిత్ర పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

"""/" / ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు తమిళ సినిమాల( Tamil Industry ) కంటే తెలుగు సినిమాలలో నటించడమే ఇష్టం అని తెలిపారు.

ఈ విషయంలో తమిళ అభిమానులు నాపై కోప్పడిన పర్లేదు కానీ ఇదే నిజమని తెలిపారు.

తమిళ చిత్ర పరిశ్రమతో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీలో( Tollywood Industry ) నటీనటులకు చాలా గౌరవ మర్యాదలు ఇస్తారని సంగీత వెల్లడించారు.

ఇక తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగే సమయంలో నాకు అవకాశాలు కావాలి అంటూ ఎవరికి ఫోన్ చేసి అడగలేదని ఈమె తెలిపారు.

"""/" / ఇకపోతే కొంతమంది ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడటం కోసం తనకు ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ గురించి చెబుతారు.

అలాగే తన రెమ్యూనరేషన్ కూడా వాళ్లే డిసైడ్ చేసి వాళ్లేదో నాకు జీవితాన్ని ఇస్తున్నట్టు మాట్లాడతారని సంగీత తెలిపారు.

ఎన్నోసార్లు నాకు రెస్పెక్ట్ కావాలని కోరుకుంటాను కానీ అది మాత్రం అక్కడి నుంచి రాదని అందుకే నాకు తమిళ సినిమాలలో నటించడం ఏ మాత్రం ఇష్టం ఉండదు అంటూ సంగీత తమిళ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించడంతో ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

దంతాల‌పై ప‌సుపు మ‌ర‌క‌ల‌ను పోగొట్టే బెస్ట్ హోమ్ రెమెడీస్ మీకోసం!