సల్మాన్ ఖాన్ పై మాజీ ప్రియురాలు సీరియస్.. కారణం ఆయన అలా అడగడమే?
TeluguStop.com
ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల మధ్య ప్రేమలు, గొడవలు వంటివి జరుగుతూనే ఉంటాయి.అలాంటివి సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి మామూలే అని చెప్పవచ్చు.
ఎందుకంటే వాళ్లు తమ వ్యక్తిగత విషయంలో ఎప్పుడూ ఒకేలా ఉండరు.ఒకరిని ఇష్టపడి మరొకర్ని పెళ్లి చేసుకుంటూ.
మళ్లీ వాళ్లతో బ్రేక్ అప్ అయ్యి కొత్త జీవితాలను ప్రారంభిస్తూ ఉంటారు.దీంతో ఇండస్ట్రీకి చెందిన వారందరిపై ప్రేక్షకులకు ఒకేరకమైన అనుమానం ఉంటుంది.
ఎప్పటికైనా వీళ్ళు ఇంతే అంటూ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలను కూడా పట్టించుకోరు.స్టార్ నటీనటుల విషయంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
కొందరు మాత్రం స్టార్ నటీనటుల విషయంలో వాళ్ల వ్యక్తిగత విషయాలను బాగా తెలుసుకోవాలని ఆత్రుత పడుతుంటారు.
అందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి తెలుసుకోవాలని బాగా ఆసక్తి చూపుతారు.
బాలీవుడ్ కండలవీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే.
ఇప్పటికీ ఈయన పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్నే గడుపుతున్నాడు.కానీ లవ్ ల విషయంలో మాత్రం లవర్ బాయ్ అనే చెప్పాలి.
ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా కూడా చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేసి హాట్ టాపిక్ గా నిలిచాడు.
"""/" /
కానీ పెళ్లి విషయంలో మాత్రం ముందుకు వెళ్లలేదు.ఈయన గతంలో బాలీవుడ్ మోడల్ సంగీత బిజ్లానీ తో కూడా ప్రేమలో పడ్డాడు.
ఆమె కూడా ఆయనను బాగా ఇష్టపడింది.ఇక వీరి రిలేషన్ పెళ్లి వరకు కూడా వెళ్లాలనుకుంది.
కానీ ఆఖరి క్షణంలో వీరి పెళ్లి ఆగిపోయింది.కారణం సల్మాన్ ఖాన్ మరో అమ్మాయితో ప్రేమలో ఉండటం వల్ల వారి పెళ్లి బ్రేకప్ అయింది.
"""/" /
ఆ తర్వాత సంగీత అజారుద్దీన్ ను పెళ్లి చేసుకుంది.కానీ కొంత కాలం తర్వాత వీరి మధ్య కూడా బ్రేకప్ జరిగింది.
అప్పటికే అజహరుద్దీన్ కు పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు.ఇక తను సంగీతని పెళ్లి చేసుకున్న విషయం తెలియటంతో అతడి భార్య అతడి నుంచి విడిపోయింది.
కానీ కొంత కాలానికి అతడు మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలిసేసరికి సంగీత అతడి నుంచి విడిపోయింది.
"""/" /
అప్పటినుంచి తను ఒంటరిగానే జీవిస్తుంది.ఇక సల్మాన్ ఖాన్ విషయంలో మాత్రం ఈమె ఇప్పటికీ కోపంగానే ఉందని తెలుస్తుంది.
తాజాగా సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను పంచుకున్నాడు.
అందులో తాను జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ షార్ట్ లెస్ తో కనిపించాడు.
ఈ ఫోటోలో తాను ఒక క్యాప్ పెట్టుకొని ఉండగా.ఈ బీయింగ్ హ్యూమన్ టోపీ బాగుంది కదా అని అభిమానులను ప్రశ్నించాడు.
దీంతో సంగీత స్పందిస్తూ.ఫైల్ ఎమోజీ ని షేర్ చేసింది.
దీంతో సంగీత స్పందించిన విధానాన్ని చూసి.నెటిజన్లు.
సంగీతకు ఇంకా సల్మాన్ పై కోపం ఉందని ఆయన అలా అడగటం తో తను అందుకే సీరియస్ అయిందని కామెంట్లు చేస్తున్నారు.
స్కామ్ కాలర్స్నే ప్రాంక్ చేసిన 92 ఏళ్ల మహిళ..