Sandeep Singh : ఆ సినిమాను రద్దు చేసుకున్న ప్రముఖ నిర్మాత.. కుటుంబానికి బెదిరింపులు రావడంతో?

ప్రముఖ సినీ నిర్మాత సందీప్ సింగ్( Produced By Sandeep Singh ) గతంలో టిప్పు సుల్తాన్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమాకు పవన్ శర్మ( Pawan Sharma ) దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు.

కానీ తాజా సినిమా తెరకెక్కించే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుపుతూ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు సందీప్ సింగ్.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.కాగా ఆ ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.

హజ్రత్‌ టిప్పు సుల్తాన్‌ ( Hazrat Tipu Sultan )చేయడం లేదు.నన్ను, నా స్నేహితులను, కుటుంబ సభ్యులను బెదిరించడం, దూషణలు చేయడం దయ చేసి, ఆపేయండి.

"""/" / ఎవరి మనోభావాలైనా కించపరిచి ఉంటే క్షమించండి.ఇది కావాలని చేసినది కాదు.

ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరి నమ్మకాలను నేను గౌరవిస్తాను.ఇక నుంచైనా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుందాం అని సందీప్‌ సింగ్‌ రాసుకొచ్చారు.

అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ట్వీట్ ని చూసిన కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / ఇకపోతే గతంలో నిర్మాత సందీప్ సింగ్ ఈ టిప్పు సుల్తాన్ సినిమా గురించి ప్రకటిస్తూ.

పవన్‌ శర్మ దర్శకత్వంలో టిప్పు సుల్తాన్ మూవీ చేస్తున్నాను.ఇది నేను వ్యక్తిగతం విశ్వసించి చేస్తున్న చిత్రం.

నా సినిమాలు సత్యం వైపు నిలబడతాయి.చరిత్ర పుస్తకాల ద్వారా ఆయన్ను ఒక గొప్ప వీరుడిగా చిత్రించి మన బ్రెయిన్‌ వాష్‌ చేశారు.

కానీ, టిప్పు సుల్తాన్‌ గురించి ఎవరికీ తెలియని క్రూరమైన మరో పార్శ్వాన్ని మేము చూపించబోతున్నాం.

భవిష్యత్‌ తరాల కోసం ఆయన చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తాం అని తెలిపారు.కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలను వల్ల ఆయన ఆ ఆలోచననే విరమించుకున్నారు.