స్పిరిట్: విలన్ విషయంలోనే కాదు హీరోయిన్ల విషయంలోనూ సందీప్ రెడ్డివంగా తగ్గేట్లేగా…??

బాహుబలి( Bahubali ) తర్వాత ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్నాడు.

అలాంటి ఈ గ్లోబల్ హీరోకి ప్రశాంత్ నీల్‌ సలార్ రూపంలో ఒక మంచి హిట్ అందించాడు.

దీని తర్వాత నాగ్‌ అశ్విన్ సుమారు రూ.1,000 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్‌ను ప్రభాస్‌ ఖాతాలో చేర్చాడు.

ఈ రెండు హిట్స్ తర్వాత మళ్లీ ప్రభాస్ కెరీర్ గాడిన పడింది.ప్రస్తుతం అతని చేతిలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.

వాటిలో స్పిరిట్ మూవీ ఒకటి దీనిపై హై రేంజ్‌లో ఉన్నాయి.ఎందుకంటే దీనిని తీస్తున్నది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికర అంశంగా మారింది.అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాలు ప్రభాస్ రేంజ్‌కి తగినవి కావి.

అలాంటివి అతనికి సూట్ కూడా అవ్వవు.కాబట్టి వేరే కథతో ఈ సినిమా వస్తూ ఉండొచ్చు.

"""/" / ఈ మూవీని జపాన్, కొరియా, చైనా ( Japan, Korea, China )భాషల్లో విడుదల చేయాలని సందీప్ భావిస్తున్నాడట.

అందుకే సౌత్ కొరియన్ స్టార్ యాక్టర్ అయిన మా డాంగ్-సియోక్ ను లైన్ లో కూడా పెట్టాడట.

ఆ యాక్టర్ ఉండటం వల్ల ఆ దేశాల వాళ్లు కనెక్ట్ అవుతారని సందీప్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

కథతోపాటు సంగీతం, గ్రాఫిక్స్, ప్రజెంటేషన్ అన్నీ బాగుంటేనే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో హిట్ అవుతుంది.

ఇక ఈ మూవీలో సరైన హీరోయిన్‌ను నటింప జేయడం కూడా ముఖ్యమే.అయితే ఈ డైరెక్టర్ ఇద్దరు హీరోయిన్లను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

"""/" / వారిలో ఒకరు ఐశ్వర్య రాయ్ ( Aishwarya Rai )కాగా మరొకరు కత్రినా కైఫ్( Katrina Kaif ) అని తెలుస్తోంది.

ఈ ముద్దుగుమ్మలు పెళ్లయ్యాక బోల్డ్ సినిమాలకు బాగా దూరమయ్యారు.మంచి ట్రెడిషనల్ పాత్రల్లో మాత్రమే నటిస్తున్నారు.

మరి అలాంటి వాళ్లతో సందీప్ ఈ సినిమాలో ఏం చేయదలచుకున్నాడు అనేది ప్రశ్నార్థకమే.

ప్రభాస్ సినిమాల్లో పద్ధతిగా హీరోయిన్లు ఉంటారని చెప్పుకోవచ్చు కానీ సందీప్ రెడ్డి మాత్రం బోల్డుగానే హీరోయిన్లను చూపిస్తాడు.

ఇదిలా ఉంటే ఐశ్యర్య, కత్రినా మధ్య మంచి రిలేషన్ షిప్ లేదు.వారిద్దరికీ స్నేహం చెడిందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

కాబట్టి వీరిద్దరూ కలిసి నటించడం కష్టమే అని అంటున్నారు.ఒకవేళ ఇద్దరూ కలిసి నటించే సీన్లు పెద్దగా లేకపోతే ఓకే చెప్పొచ్చు.

ఇలాంటి బడా హీరోయిన్లను తీసుకుంటే బడ్జెట్ బాగా పెరిగిపోతుంది.మరి ఈ మూవీ హిట్ అవుతుందో లేదో చూడాలి.

నా కొడుకు చావుకు వాళ్లే కారణం… ఎమోషనల్ అయినా గీతూ రాయల్?