Sandeep Vanga Rashmika: రష్మిక కు ఆనిమల్ సినిమాలో అందుకే అవకాశం ఇచ్చాను : సందీప్ రెడ్డి వంగా
TeluguStop.com
సందీప్ రెడ్డి వంగా.( Sandeep Reddy Vanga ) ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ కాదు.
బాలీవుడ్ కాదు దేశం మొత్తం సంచలనం సృష్టిస్తోంది.మొదట అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు సందీప్.
ఆ తర్వాత అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ కొట్టాడు.
కానీ ఇప్పుడు రణబీర్ సింగ్, రష్మిక మందన హీరో హీరోయిన్స్ గా ఆనిమల్( Animal Movie ) అనే సినిమాకి దర్శకత్వం వహించి తన పవర్ ఏంటో బాలీవుడ్ కి తెలిసి వచ్చేలా చేసాడు ఈ తెలుగు దర్శకుడు.
తాజాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెబితే అది చాలా చిన్న విషయమే అవుతుంది.
ఎందుకంటే అభిమానులంతా కూడా ఈ సినిమా చూసి బయటకు వచ్చి చెబుతున్న మాట ఒకటే ఒకటి ఈ సినిమా మ్యాడ్ లాగ ఉంది అని.
"""/" /
సినిమా అంటే ఇదిరా అనే విధంగా ఆనిమల్ సినిమా ఉందని రణబీర్ సింగ్( Ranbir Singh ) కెరియర్ లోనే ఇది అత్యధిక మైలేజ్ ఉన్న సినిమా అని, కలెక్షన్స్ కూడా వెయ్యి కోట్లు దాటే అంచనా ఉందంటూ ప్రతి ఒక్కరు ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారు.
సరే.సినిమా గురించి, రివ్యూ సంగతి గాని ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు కానీ ఈ సినిమాకి రష్మికను( Rashmika Mandanna ) ఎందుకు హీరోయిన్ గా తీసుకున్నారు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.
ఎందుకంటే రష్మిక మరియు విజయ్ దేవరకొండ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ రెడ్డి చిత్రంలో( Arjun Reddy ) విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అప్పటి నుంచి సందీప్, విజయ్ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు.
"""/" /
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఏర్పడిన వీరి స్నేహమే ఇప్పుడు రష్మికకు ఆనిమల్ సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది అనేది టాలీవుడ్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
రష్మికను బాలీవుడ్ లో బిజీ చేయాలని విజయ్( Vijay Devarakonda ) తనకు ఉన్న అన్ని కాంటాక్ట్స్ వాడుతున్నాడని అందుకే ఆమెకు ఆనిమల్ సినిమాలో అవకాశం వచ్చిందని ఈ సినిమా విజయం సాధించడంతో రష్మికకు బాలీవుడ్ వరస ఆఫర్లు ఇస్తుందని అంతా భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ విషయంపై సందీప్ రెడ్డి కూడా స్పందించాడు తనకు ఈ పాత్ర చక్కగా సూట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇచ్చాను దానిపై ఎవరి ప్రభావం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట వెన్నలా కరిగిపోతుంది..!