నేను మాట్లాడితే బూతులు.. తను మాట్లాడితే నీతులా.. సందీప్ మాస్టర్ కామెంట్స్ వైరల్!

ఆట డాన్స్ షో ద్వార ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సందీప్ మాస్టర్ ( Sandeep Master ) ప్రస్తుతం ఎన్నో డాన్స్ వీడియోలను చేస్తే సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.

ఇక ఈయన బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి నీతోనే డాన్స్ అనే కార్యక్రమంలో పాల్గొని టైటిల్ గెలిచారు.

ఇక ఈ కార్యక్రమం పూర్తి కాగానే వెంటనే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడంతో సందీప్ మాస్టర్ బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇలా ఈ కార్యక్రమంలో ఈయన 8 వారాలపాటు కొనసాగి 8వ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.

ఇలా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

"""/" / ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సందీప్ మాస్టర్ ఎన్నో విషయాల గురించి ఓపెన్ అవుతూ నిర్మొహమాటంగా అన్ని విషయాలను చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఓసారి తాను హౌస్ లో ఉన్నప్పుడు నామినేషన్స్ లో భాగంగా బొంగులో అనే పదం ఉపయోగించారు.

అయితే ఈ విషయంపై నాగార్జున ( Nagarjuna ) సందీప్ మాస్టర్ కు బాగానే క్లాస్ పీకారు.

ఇక సందీప్ మాస్టర్ ఒకసారి ఇలా మాట్లాడిన నాగార్జున పదే పదే సందీప్ ని బొంగులో డ్యాన్సర్ అంటూ సంబోధించి ఆయన్ని అవమానించాడు.

దీనికి సందీప్ సతీమణి జ్యోతి కూడా చాలా బాధపడింది. """/" / ఈ విధంగా సందీప్ మాస్టర్ ను నాగార్జున బొంగులో డాన్సర్ అనడంతో సందీప్ మాస్టర్ కూడా చాలానే ఫీల్ అయ్యారు అయితే తాజాగా ఈ విషయం గురించి సందీప్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక తాజాగా హౌస్ లో శివాజీ కూడా ఇలాంటి బూతు పదాలే మాట్లాడటంతో సందీప్ మాస్టర్ ని తిట్టిన విధంగా నాగార్జున శివాజీ( Shivaji ) ని తిట్టలేదు.

దీంతో ఎంతో ఫీలయినటువంటి సందీప్ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నాగార్జున గురించి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

నేను మాట్లాడితే బూతులు.ఆయన మాట్లాడితే నీతులు భలే న్యాయం చెప్పారు నాగార్జున గారు అంటూ వెటకారంగా ఈ పోస్ట్ చేయడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

13 ఏళ్లకే సన్యాసినిగా మారిన బాలిక.. కుంభమేళాలో ఈ ఘటనపై మీరేమంటారు..