కరోనాతో ఆ ఇద్దరు హీరోల కెరీర్‌ కష్టాల్లో..!

కరోనాతో ఆ ఇద్దరు హీరోల కెరీర్‌ కష్టాల్లో!

తెలుగు సినిమా పరిశ్రమనే కాకుండా కరోనా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తుంది.

కరోనాతో ఆ ఇద్దరు హీరోల కెరీర్‌ కష్టాల్లో!

ప్రతి ఒక్కరు కూడా కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వారే.ముఖ్యంగా కొత్త హీరోలు అప్‌ కమింగ్‌ హీరోలు మాత్రం కరోనా కారణంగా మొత్తం జీవితమే తలకిందులు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

కరోనాతో ఆ ఇద్దరు హీరోల కెరీర్‌ కష్టాల్లో!

సందీప్‌ కిషన్‌ మరియు నాగశౌర్యల సినీ కెరీర్‌ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డట్లయ్యింది.కరోనాకు ముందు వీరి కెరీర్‌ ఒక మోస్తరుగా సాగుతూ వచ్చింది.

కాని ఇప్పుడు మాత్రం వారి కెరీర్‌ ఆందోళనకరంగా మారింది.కరోనాతో పలు సినిమాలు రద్దు అవుతున్నాయి.

ఎన్నో సినిమాలు ఆరంభం అయిన తర్వాత ఆగిపోయాయి.మళ్లీ ప్రారంభం అవుతాయో లేదో తెలియని పరిస్థితి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొత్త సినిమాలు ప్రారంభం అయ్యే అవకాశమే లేదు.

దాంతో వీరిద్దరి కెరీర్‌ కష్టాల్లో పడ్డట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీరిద్దరు కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు.వీరిద్దరికి సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి.

వాటిల్లో ఏమైనా ప్రయోగాలు చేసుకోవాల్సిందే తప్ప వీరితో సినిమాలను నిర్మించేందుకు ఏ నిర్మాత కాని ముందుకు వచ్చే పరిస్థితి లేదు.

రానున్న రెండు సంవత్సరాల వరకు ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.