స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న సందీప్ కిషన్
TeluguStop.com
చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లో సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్ద గా పేరు రాని హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు.
అపుడెప్పుడో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్ ఆ తరువాత చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
దాంట్లో లోకేష్ కనక రాజు డైరెక్షన్ లో వచ్చిన నగరం సినిమా కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ దాని తర్వాత కూడా చాలా ప్లాపులు వచ్చాయి.
సందీప్ తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన విజయ్ దేవరకొండ లాంటి హీరో తక్కువ కాలం లోనే స్టార్ హీరో రేంజ్ స్టేటస్ ను అందుకుంటే సందీప్ మాత్రం ఇంకా హిట్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు అని తెలుస్తుంది.
ఇక ఇది ఇలా ఉంటే సందీప్ కిషన్ తన నెక్స్ట్ సినిమా ను తన ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయిన దేవకట్టా డైరెక్షన్ లో చేయబోతున్నట్టు తెలుస్తుంది.
దేవకట్టా సాయి ధరమ్ తేజ్ తో చేసిన రిపబ్లిక్ సినిమా బాగానే ఉన్నప్పటికీ అప్పుడు జరిగిన చిన్న చిన్న కాంట్రవర్సీ లా ద్వారా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వలేక పోయింది.
అయితే ఇప్పుడు దేవకట్టా రాసుకున్న స్టోరీ కి సందీప్ కిషన్ అయితే పెర్ఫెక్ట్ గా సరిపోతాడు అని అనుకున్న దేవకట్టా రీసెంట్ గా అతనికి ఒక కథ చెప్పినట్లు తెలుస్తుంది.
"""/"/
.దానికి సందీప్ కిషన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది.
సందీప్ కిషన్ చాలా అంచనాలు పెట్టుకున్న మైకేల్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్స్ ఆఫీసు వద్ద ప్లాప్ అయ్యింది అయితే తను కూడ ఇక ఏ ప్రయోగాలు చేయకుండా దేవాకట్టా తో సినిమా చేసి హిట్ ట్రాక్ ఎక్కలని చేస్తున్నాడు వీళ్ళ కాంబో లో ఇప్పటికే ప్రస్థానం సినిమా వచ్చి మంచి విజయం సాధించింది.
సందీప్ ప్రస్థానం సినిమా లో హీరో కాకపోయినా ఆయన ఈ సినిమా లో చేసిన నటన కి మంచి పేరు వచ్చింది.
"""/"/
ఇక ఈ సినిమా అటు సందీప్ కిషన్ కి ఇటు దేవకట్టా కి కూడా కీలకమైన సినిమా గా చెప్పవచ్చు ఎందుకంటే వీళ్లిద్దరూ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అందుకని వీళ్ళిద్దరికీ కూడా మంచి హిట్ సినిమా పడితే వీళ్ళ రేంజ్ మారిపోతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రెమ్యునరేషన్ లెక్కలివే.. ఏకంగా అంత తీసుకుంటున్నారా?