ఇసుకే అతడి ఆహారం.. బజ్జీలు తిన్నట్లు తినేస్తున్నాడు!

మీరెప్పుడైనా చిన్నతనంలో తల్లిదండ్రులు వద్దన్న దానిని తిన్నారా? స్కూలుకు వెళ్లినప్పుడు బలపాలు తినే వారు కొందరుంటే ఇంకొందరికి చాక్ పీస్‌లు అంటే ఇష్టంగా లాగించేస్తుంటారు.

ఇంకొందరికి వర్షం కురిసినప్పుడు వచ్చే మట్టి వాసన అంటే ఇష్టం ఉంటుంది.కాస్త మట్టిని నోటిలో వేసుకుని స్వీట్ తిన్నట్లు ఫీల్ అవుతారు.

ఇదే క్రమంలో కొందరు కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకుంటారు.మరికొందరు రాళ్లు తిని జీవిస్తుంటారు.

ఇదే కోవలో ఓ వ్యక్తి ఇసుకను రోజూ చాలా ఇష్టంగా తినేస్తున్నాడు.అందరూ అతడిని ఆశ్చర్యపోతున్నా, తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడు.

రోజూ నది ఒడ్డుకు వెళ్లి గుప్పెడు ఇసుక నోట్లే వేసుకుని బజ్జీలు మింగినట్లు తినేస్తున్నాడు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఒడిశా రాష్ట్రానికి చెందిన హరిలాల్ సక్సేనాకు ప్రస్తుతం 68 సంవత్సరాల వయసు.

ఆయన గత 40 ఏళ్లుగా ఇసుకను ఎంతో ఇష్టంగా తినేస్తున్నారు.భోజనానికి ముందో లేక భోజనం చేసిన తర్వాతనో గుప్పెడు ఇసుక తింటే కానీ అతడికి మనశ్శాంతి ఉండదు.

భోజనం తిన్న తర్వాత కొంత మంది కిళ్లీ వేసుకుని ఎంత సంతోష పడతారో ఇతడికి ఇసుక తింటే అంత ఆనందం.

అందరూ వింతగా చూస్తున్నా అతడు ఏ మాత్రం ఇబ్బందిగా భావించడు.ఇప్పటి వరకు దాదాపు 40 ఏళ్లుగా ఇలా ఇసుకను తింటున్నప్పటికీ హరిలాల్‌కు ఏ మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తలేదు.

అయితే ఇసుకను గొంతులో వేసుకోగానే తనకు కాస్త ఇబ్బందిగా ఉంటుందని, ఆ తర్వాత అరిగి పోతుందని చెబుతున్నాడు.

అతడి మాటలు విన్న స్థానికులు మాత్రం నోరెళ్లబెడుతున్నారు.చిన్నప్పుడు నదికి వెళ్లి ఇసుక తినడం అలవాటైందని, వర్షాకాలం వస్తే ముందు జాగ్రత్తగా బస్తాలలో ఇసుక నింపుకుని ఇంటిలో పెట్టుకునే వాడినని చెబుతున్నాడు.

అతడికి ఇదేం పిచ్చి అని అందరూ విస్తుపోతున్నారు.ఇక హరిలాల్ మాత్రం అదేమీ పట్టకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.

నిర్మాతగా మారుతున్న గోల్డెన్ లెగ్ బ్యూటీ.. ప్రొడ్యూసర్ గా భారీ సక్సెస్ సాధిస్తారా?