అమెరికాలో మరో సారి కాల్పులు...!

అమెరికాలో వరుస కాల్పులు హోరెత్తిస్తున్నాయి.అగ్ర రాజ్యంగా పేరొందిన అమెరికా తుపాకీ సంస్కృతికి మాత్రం అడ్డుకట్ట వేయలేక పోతోంది.

ఎంతో మంది మేధావులు ఈ సంస్కృతిపై నోళ్ళు కొట్టుకుంటున్నా సరే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా ఉండటం లేదని వాపోతున్నాయి ప్రజా సంఘాలు.

ఈ క్రమంలోనే మరో మారు అమెరికాలోని కాలిఫోర్నియా లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

శాన్ఫ్రాన్సిస్కో లోని అత్యంత ధనికులు ఉండే బే ఏరియా కమ్యూనిటీ లో జరిగిన ఈ ఘటన అక్కడ స్థానికులని షాక్ కి గురిచేసింది.

గతంలో ఎన్నడూ కూడా అక్కడ కాల్పులు జరిగిన సంఘటనలు లేవని స్థానికులు అంటున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరిశీలిస్తే. """/"/అమెరికాలో ధనికులు ఉండే ప్రాంతంలో పార్టీ జరుగుతున్న క్రమంలో ఒక్క సారిగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే 4 గురు వ్యక్తులు చనిపోగా, మరో కొంతమంది గాయాల పాలయ్యారు.

సుమారు 100 మంది పాల్గొన్న ఈ వేడుకలో అందరూ భయాందోళనలకి లోనవ్వడంతో పరుగులు పెట్టే క్రమంలో తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు.

నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ భారత్ లో లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే..!