విరూపాక్ష సక్సెస్… హీరోకి టైట్ హగ్ ఇచ్చి సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన కోలుకోగానే విరూపాక్ష సినిమా (Virupaksha Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

ఇలా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ రావడంతో చిత్ర బృందం సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా పై పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. """/" / ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సైతం ఓ థియేటర్లో ప్రేక్షకుల నడుమ ఈ సినిమాని వీక్షించారు.

అనంతరం థియేటర్ బయటకు వచ్చిన తర్వాత హీరో హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతలు అందరూ కూడా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik Dandu) కేక్ కట్ చేసి హీరో హీరోయిన్ కి నిర్మాతలకు కేక్ తినిపించారు.

అనంతరం నటి సంయుక్త మీనన్ (Samyuktha Menon) సాయిధరమ్ తేజ్ కు కేక్ తినిపించడమే కాకుండా సంతోషంలో తనని గట్టిగా హగ్ చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు.

"""/" / నటి సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా కంటే ముందుగానే ఈ సినిమాకి కమిట్ అయ్యారు.

అయితే తేజ్ ప్రమాదానికి గురి కావడంతో ఈ సినిమా కాస్త ఆలస్యమైంది.భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంయుక్త మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

"""/" / అనంతరం బింబిసారా, సార్ వంటి సినిమాలలో కూడా నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సంయుక్త తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా మరొక సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

10 రూపాయల టికెట్ కొని పుష్ప ది రూల్ చూశా.. నటి సంయుక్త షాకింగ్ కామెంట్స్ వైరల్!