పవన్ ఫ్యాన్స్ నన్ను అలా పిలుస్తున్నారు.. భీమ్లా నాయక్ బ్యూటీ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కి గతేడాది థియేటర్లలో విడుదలైన భీమ్లా నాయక్ మూవీ అంచనాలకు మించి సక్సెస్ సాధించింది.

ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించగా మరో కీలక పాత్రలో సంయుక్త మీనన్ నటించిన సంగతి తెలిసిందే.

అయితే సంయుక్త మీనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

భీమ్లా నాయక్ మూవీలో పవన్ ను అన్నా అని పిలిచినందుకు నేను ఎక్కడికి వెళ్లినా పవన్ ఫ్యాన్స్ చెల్లెమ్మా అని పిలుస్తున్నారని సంయుక్తా మీనన్ చెప్పుకొచ్చారు.

భీమ్లా నాయక్ ను థియేటర్లో చూశానని అయితే నాకు స్టేడియంలో కూర్చుని సినిమా చూసిన అనుభూతి కలిగిందని సంయుక్త మీనన్ కామెంట్లు చేశారు.

టాలీవుడ్ ప్రేక్షకులను చూసిన తర్వాత సినిమాను పండుగలా ఏ విధంగా జరుపుకుంటారో అర్థమైందని సంయుక్త మీనన్ అన్నారు.

సెట్ కు వెళ్లిన ప్రతిసారి నా వల్ల ఏ తప్పు జరగకూడదని భావిస్తానని ఆమె పేర్కొన్నారు.

నా రోల్ కు మరొకరు డబ్బింగ్ చెబితే నచ్చదని ఆమె తెలిపారు.ఇప్పుడు నాకు తెలుగు మాట్లాడటం బాగా వచ్చని ఇంట్లో కూడా తెలుగులోనే మాట్లాడుతున్నానని సంయుక్త మీనన్ కామెంట్లు చేశారు.

ప్రాంతాన్ని బట్టి యాస మారిపోతుందని రాజమండ్రిలో ఒకలా మాట్లాడితే వరంగల్ లో మరోలా మాట్లాడతారని ఆమె అన్నారు.

"""/"/ మలయాళంలో సెట్స్ లేకుండా సినిమాల షూట్ జరుగుతుందని కేవలం నెల రోజుల్లోనే అక్కడ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తారని సంయుక్త మీనన్ కామెంట్లు చేశారు.

తెలుగులో వరుస సక్సెస్ లతో సంయుక్త మీనన్ రెమ్యునరేషన్ పెరిగిందని సమాచారం.సంయుక్త మీనన్ ఒక్కో సినిమాకు అరకోటి కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ఇండియా లో ప్రస్తుతం ప్రభాసే నెంబర్ వన్ హీరోనా..?