టాప్‌ ప్లేస్‌లో నిలిచిన శామ్‌సంగ్‌… 2, 3 స్థానాలు ఈ కంపెనీలవే!

నేటి దైనందిత జీవితంలో స్మార్ట్ఫోన్ వినియోగం పరిపాటి అయింది.ముఖ్యంగా ఇక్కడ స్మార్ట్ఫోన్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

దాంతో వాటికి భారత్ ప్రధాన మార్కెట్గా అవతరించింది.ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకర్షించడం కోసం పలు కంపెనీలు అద్భుతమైన ఫీచర్స్తో స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి దించుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్పై ఓ రిపోర్ట్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

"""/"/ వివరాల్లోకి వెళితే, గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న షియోమీ, ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోవడం కొసమెరుపు.

అవును, ఇపుడు షియోమీ స్థానాన్ని దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ కైవసం చేసుకుంది.

దీని తరువాత ఆశ్చర్యకరంగా వివో రెండో స్థానంలోకి ప్రవేశించడం గమనార్హం.Canalys న్యూ డేటా ప్రకారం.

2017 మూడో త్రైమాసికం తరువాత 2022 నాలుగో త్రైమాసికంలో శామ్సంగ్ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తిరిగి అగ్రస్థానికి చేరుకుంది.

"""/"/ ఈ కంపెనీకి అత్యంత ముఖ్యమైన దేశాల్లో భారత్ ఒకటి.చాలాకాలం తరువాత శామ్సంగ్ తిరిగి లీడర్షిప్ స్థానాన్ని ఇక్కడ పొందడం విశేషంగానే చెప్పుకోవాలి.

ఇక కొన్నాళ్లపాటు ప్రథమస్థానంలో కొనసాగిన చైనీస్ బ్రాండ్ షియోమీ 2022 Q4లో టాప్ ప్లేస్ను చేజార్చుకొని 3వ స్థానంతో సరిపెట్టుకుంది.

శామ్సంగ్ తన ప్రొడక్టుల మునుపటికంటే లైనప్ విస్తరించిన సంగతి తెలిసినదే.ముఖ్యంగా బడ్జెట్, మిడ్ రేంజ్ డివైజ్లతో తన పోర్ట్ఫోలియోను మరింత విస్తృతం చేసింది.

ఇక సరసమైన ధరలకు స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి తీసుకురావడం వలన శామ్సంగ్ కి బాగా కలిసొచ్చింది.

ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం… ఫాలోయింగ్ మామూలుగా లేదుగా?