ఈ ఒక్క సినిమా మీదనే సంపత్ నంది భవిష్యత్…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్లకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ సంపత్ నంది( Sampath Nandi ) కూడా వరుసగా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ఆయనకు విజయాన్ని ఇవ్వడంలో చాలా వరకు ఫెయిల్ అయ్యాయి అయితే ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా పర్లేదు అనే టాక్ తెచ్చుకున్నాయి తప్ప ఇప్పటి వరకు ఒక్కటి కూడా అతనికి అదిరిపోయే హిట్ అయితే ఇవ్వలేదు.
ఇక దాంతో గాంజా శంకర్ సినిమా( Gaanja Shankar ) మంచి విజయాన్ని సాధించి తన కెరీయర్ లో తనకు ఒక బెస్ట్ సినిమాగా నిలుస్తుందని తను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
"""/" /
ఇక ఇప్పటివరకు బాగానే ఉంది కానీ ఈయన చేసే సినిమాలు పెద్ద ఎఫెక్టివ్ గా ఉండకపోవడంతో ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే సంపత్ నంది లాంటి దర్శకుడు ఒకసారి హిట్టు కొట్టి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం గాంజా శంకర్ సినిమా తోనే తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
"""/" /
ఇక ఈ సినిమాతో కనుక సక్సెస్ కొట్టకపోతే మాత్రం ఇక ఆయనకి అవకాశం ఇచ్చే హీరో ఎవరు లేరనే చెప్పాలి.
ఇక ఇప్పటికే రామ్ చరణ్ తో రచ్చ, రవితేజ తో బెంగాల్ టైగర్, గోపీచంద్ తో గౌతమ్ నంద, సీటిమార్ సినిమాలు చేసినప్పటికీ అవేవీ పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు అన్ని యావరేజ్ సినిమాలే కాబట్టి అతనికి ఏ స్టార్ హీరో కూడా అవకాశము ఇవ్వడం లేదు.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?