ట్రైన్‌లో సమోసాలు.. తినే ముందు చూసి కంగుతిన్న ప్రయాణికులు
TeluguStop.com
ఎవరైనా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు అందులో అమ్మే టీ, సమోసాలు, ఇతర పదార్ధాలు కొనుక్కుని తింటుంటారు.
ఇక టీ అయితే అవి వేడి నీళ్లలాగానే ఉంటాయి.అయినప్పటికీ టీ తాగకుండా ఉండలేక పోతుంటారు.
దీంతో టీ అమ్మే వ్యక్తిని పిలిచి, కొనుక్కుని తాగుతుంటుంటారు.ఇక పిల్లలతో ప్రయాణం చేస్తే మాత్రం వారు అడిగే సమోసాలను ఖచ్చితంగా కొనాల్సిందే.
లేకపోతే కొందరు పిల్లలు మారాం చేస్తారు.మరికొందరు కిందపడి మరీ ఏడుస్తుంటారు.
దీంతో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పెద్దలు కొన్ని సమోసాలను కొని ఇస్తుంటారు.
అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
తాజాగా బయటకొచ్చిన ఓ వీడియోలో సమోసాలు ఎంత అధ్వాన్నంగా తయారు చేస్తున్నారో తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఇటీవల ప్రయాణికులతో దానాపూర్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రద్దీగా ఉంది.
రైల్వే క్యాంటీన్‌లో తయారు చేసిన సమోసాలంటూ ఓ వ్యక్తి వాటిని విక్రయించసాగాడు.ప్రయాణంలో ఆకలిగా ఏం ఉంటాంలే అనే ఉద్దేశంతో కొందరు వాటిని కొనుక్కుని తిన్నారు.
నాగ్‌పూర్ వెళ్తున్న ఇద్దరు యువకులు కూడా వాటిని కొనుక్కుని తినబోయారు.ఆలూ సమోసా ఎంతో రుచికరంగా ఉందనుకుంటే టేస్ట్ మారిపోయింది.
దీంతో అనుమానం వచ్చి ఆ సమోసాను వారు పరిశీలించారు.అందులో ఆలూ కుర్మా ఏ మాత్రం లేదు.
దానికి బదులు పాడైపోయిన అన్నాన్ని అందులో కనిపించగానే వారు కంగుతిన్నారు.దీంతో ఆలూ సమోసాలు అమ్మిన వ్యక్తితో వారు గొడవ పడ్డారు.
నాసిరకమైన పదార్థాలతో చేసిన సమోసాలను అమ్మితే, వాటిని తిన్న వారి ఆరోగ్యం ఏమవుతుందని నిలదీశారు.
విషయం తెలుసుకున్న క్యాంటీన్ మేనేజర్ హడావుడిగా అక్కడకు వచ్చాడు.ఆ యువకులకు క్షమాపణలు చెప్పాడు.
ఇంకెప్పుడూ అలా జరగకుండా చూసుకుంటామని వేడుకున్నాడు.దీంతో శాంతించిన ఆ యువకులు వివాదాన్ని ముగించారు.
తాము చేరాల్సిన నాగపూర్ స్టేషన్ రాగానే దిగి వెళ్లిపోయారు.అయితే ట్రైన్‌లో వీరి వివాదాన్ని మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టాడు.
దీంతో ఆ వీడియో వైరల్ అయింది.ట్రైన్‌లో అమ్మే సమోసాలను ఒకటికి రెండు సార్లు చూసుకుని తినాలని కొందరు సూచిస్తున్నారు.
ఇంకొందరు అసలు తినొద్దని సలహా ఇస్తున్నారు.