ఇద్దరు అమ్మాయిల ప్రేమ… కోర్టులో పెళ్లి… చివరకు?

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే కలియుగంలో అనేక వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలో తాజాగా ఇద్దరు అమ్మాయిలు కోర్టు మెట్లెక్కి వివాహం చేసుకున్నారు.పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో కోర్టు మెట్లెక్కిన యువతులు అనుకున్నది సాధించారు.

ఇరుగు పొరుగున ఉండే ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కోర్టు ఇద్దరు యువతుల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆమె తల్లిదండ్రుల వంతయింది.

పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన ఈ స్వలింగ సంపర్కుల వివాహం ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్ లోని జలంధర్ అనే ప్రాంతంలో ఇస్రత్, నగ్మా అనే యువతులు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు.

ఇద్దరి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా ఆ పై ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని ఇద్దరు యువతులు నిర్ణయం తీసుకున్నారు.

నగ్మా తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించగా ఇస్రత్ కుటుంబ సభ్యులు మాత్రం వివాహానికి ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోమని తెలిపారు.

ఇస్రత్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసుల సహాయంతో కోర్టు మెట్లెక్కి వివాహం చేసుకున్నారు.

అనంతరం పెళ్లి చేసుకున్నందుకు స్థానికులకు మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నారు.

కోర్టులో పెళ్లి జరిగిన విషయం తెలిసి ఇస్రత్ కుటుంబ సభ్యులు ఆమెతో తెగదెంపులు చేసుకున్నారు.

దీంతో ఇస్రత్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గతంలో మెట్రో నగరాలకే స్వలింగ సంపర్కుల వివాహాలు పరిమితం కాగా ఇప్పుడు చిన్నపట్టణాల్లోనూ ఇలాంటి వివాహాలు జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలు తెస్తే బాగుంటుందని తెలుపుతున్నారు.

స్టార్ హీరో విజయ్ పదో తరగతి మార్క్ లిస్ట్ వైరల్.. అతని మార్కులు తెలిస్తే షాకవ్వాల్సిందే!