కమర్షియల్ సినిమా కాని ‘యశోద’ ను జనాలు ఎందుకు చూడాలంటే..!
TeluguStop.com
సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ఈ నెల 11వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా సరోగసి విధానం నేపథ్యం లో రూపొందినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం అయితే వచ్చింది.ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కానే కాదు అంటూ చాలా మంది అభిప్రాయం చేస్తున్నారు.
కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ సినిమా ఒక మంచి కాన్సెప్ట్ సినిమా అని.
ప్రతి ఒక్క ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని చెప్తున్నారు.కమర్షియల్ సినిమా కాకున్నా కూడా అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమా లో ఉంటాయని.
కామెడీ తో పాటే యాక్షన్స్ అన్ని హంగులు కూడా ఈ సినిమా కు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్పడం తో యశోద పై అంచనాలు పెరుగుతున్నాయి.
భారీ అంచనాల నడుమ ఈ నెల 11 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సమంత హాజరు కాలేక పోతుంది.
ఆమె అనారోగ్య కారణాల వల్ల కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి సినిమా పై అంచనాలు పెరిగేలా చేసింది.
"""/"/
ఇక ఈ సినిమా లో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ప్రమోషన్ బాధ్యతలను పూర్తిగా తన భుజ స్కందాలపై వేసుకుని మరీ ప్రమోషన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.
ఇక యశోద సినిమా కలెక్షన్స్ విషయం లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.
కేవలం తెలుగు లోనే కాకుండా తమిళం హిందీ కన్నడ మరియు మలయాళం లో కూడా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.
దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి.100 కోట్ల సినిమా అంటూ చాలా మంది చాలా రకాలుగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
మరి ఆ స్థాయి లో ఈ సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్17, మంగళవారం 2024