'యశోద' డిజిటల్ రైట్స్.. భారీ మొత్తంతో సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!

సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేసి అందరి చేత శబాష్ అనిపించు కుంది.

విడాకుల తర్వాత పడిలేచిన కెరటంగా వరుస అవకాశాలు దక్కించు కుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.

ప్రెసెంట్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచింది.

ఈ సినిమాతో పాటు యశోద కూడా స్టార్ట్ చేసి ఎప్పుడో షూట్ అయితే పూర్తి చేసుకుంది.

ఈ సినిమాతో హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ పతాకంపై ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.

మరి సమంత వరుస సినిమాలు ప్రకటించడంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక యశోద సినిమా అప్డేట్ కోసం సామ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

"""/"/ ఈ క్రమంలోనే ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించారు.నవంబర్ 11న రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పడంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక తాజాగా మరొక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.

భారీ మొత్తం చెల్లించి ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టు టాక్.

దీంతో థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించింది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి.

డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?