Samantha : ఒక పూట భోజనం.. 500 కోసం హోటల్ లో పని చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడిప్పుడే ఆరోగ్య పరిస్థితుల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత మళ్ళీ సినిమాలలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

చివరిగా సమంత ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

సమంత రీ ఎంట్రీ కోసం ప్రస్తుతం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. """/" / సమంత సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అలాగే అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటుంది.

ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం సమంత బాలీవుడ్( Bollywood ) కి ఎంట్రీ ఇవ్వబోతోందట.

"""/" / ఇటీవల ఒక వేదికపై సమంత తన బాల్య జీవితం గురించి గుర్తు చేసుకున్నారు.

మధ్య తరగతి కుటుంబానికి చెందిన తాను ఒక పూట భోజనం చేయడానికి కూడా కష్టపడ్డానని చెప్పారు.

చిన్నతనం నుంచి తనను బాగా చదువుకోమని అమ్మానాన్న చెప్పేవారన్నాని, తాను కూడా చదువు మీద దృష్టి పెట్టానని, అలా కళాశాల విద్య వరకు చదివానని, ఇంకా చదవాలని ఆశ ఉన్నా తన కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించలేదు అని తెలిపింది సమంత.

అలాగే అంది వచ్చిన అన్ని పనులు చేశాను అని చెప్పుకొచ్చింది. """/" / కాబట్టి ఎవరైనా కలలు కనవచ్చునని అయితే అవి ఆచరణ సాధ్యమేనా అన్న విషయం కూడా ఆలోచించుకోవాలి అని చెప్పుకొచ్చింది.

అదే విధంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన సమంతను ఒక వ్యక్తి మీ తొలి సంపాదన ఎంత అన్న ప్రశ్నించగా.

సమంత స్పందిస్తూ నేను చదువుకుంటున్న రోజుల్లో ఒక స్టార్‌ హోటల్‌లో జరిగిన ఒక ఈవెంట్‌ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించాను.

అప్పుడు అందుకు గాను నాకు రూ.500 ఇచ్చారు.

అదే నా తొలి సంపాదన అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చింది.దీంతో సమంత సినిమాలలోకి రాకముందు ఎంత కష్టపడింది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.

ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు కోట్లలో పారితోషికం అందుకుంటున్న సమంత ఒకప్పుడు 500 కోసం ఒక హోటల్లో పని చేసింది అంటే ఆ సమయంలో ఆమెకు ఎలాంటి కష్టాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

పుష్ప 2 పరిస్థితి ఏంటి..? ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది…