డైరెక్టర్ తో కలిసి తిరుమల వెళ్లిన సమంత…. బలపరుస్తున్న డేటింగ్ రూమర్లు! 

సినీ నటి సమంత (Samantha)ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఈమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే.

సమంత నిర్మాణంలో త్వరలోనే శుభం (Subham)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా సమంత తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్న విషయం మనకు తెలిసిందే.

సమంత తిరుపతి చేరుకున్న అనంతరం డిక్లరేషన్ పై సంతకాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రస్తుత ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" / ఇకపోతే సమంత డైరెక్టర్ రాజ్(Raj) నిడుమోరుతో కలిసి తిరుమల ఆలయానికి రావటంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది.

గత కొంతకాలంగా సమంత ఈ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సమయం నుంచి సమంతకు రాజ్ తో మంచి పరిచయం ఏర్పడింది.

అంతేకాకుండా ఇటీవల కాలంలో సమంత ఎక్కడికి వెళ్లినా కూడా డైరెక్టర్ రాజ్ తో కలిసి కనిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.

"""/" / సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈయనతో ప్రేమలో పడ్డారనే వార్తలు బలంగా వినపడ్డాయి అయితే ఈ వార్తలకు బలం చేకూరే విధంగా సమంత మరోసారి తిరుమలలో డైరెక్టర్ తో కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

అయితే రాజ్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే.ఇక ‘శుభం’ అనే సినిమాను సమంత కొత్తగా ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ ట్రాలాలా నిర్మించింది.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న  నేపథ్యంలో ఈమె శ్రీవారిని దర్శించుకున్నారు.

గతంలో కూడా సమంత ఎన్నో సందర్భాలలో మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు.