సమంత వేణు స్వామిని అంత మాట అనిందా.. ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పుకార్లు?
TeluguStop.com
తెలుగు ప్రజలకు వేణు స్వామి గురించి ఆయన తట్టిలేపే వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నిత్యం యూట్యూబ్ లో ఎవరో ఒక సెలబ్రేటి జాతకం గురించి ఉన్నది లేనిది అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటాడు.
ఒకవేళ వేణుస్వామి వేసిన జాతకం రాళ్లు తగిలితే నిజమని ఒకవేళ జరగకపోతే జనాలు అబద్ధం అని నమ్ముతూ ఉంటారు.
ఇక పలువురు సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు కూడా వేణు స్వామి జాతకాలు చెబుతూ ఉంటాడు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వివాదాస్పద స్వామి గా కూడా పేరు తెచ్చుకున్నాడు వేణు స్వామి.
గతంలో సమంత, నాగచైతన్యల పెళ్లి సమయంలో కూడా వాళ్లు విడాకులు తీసుకుంటారు అని తన జోష్యంతో అందరిని షాక్ అయ్యేలా చేశాడు.
ఇక ఆ విషయం గురించి సమంత వేణు స్వామి పై ఫైర్ అయిందని తెలుస్తుంది.
ఇంతకు అసలు విషయం ఏంటంటే. """/" /
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత.
ఈమె నటన గురించి, వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే.అయితే సమంత ఎప్పుడైతే నాగచైతన్య నుండి విడిపోయిందో అప్పటినుండి జనాల దృష్టిలో నెగిటివ్ ముద్రను సంపాదించుకుంది.
నాగచైతన్యతో విడిపోక ముందు వరకు తెలుగు ప్రేక్షకుల నుండి సమంతకు మంచి అభిమానం ఉండేది.
పైగా తనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది.కానీ ఒక విడాకుల పేరుతో తనకున్న గౌరవం హోదా మొత్తం కోల్పోయింది.
తొలిసారిగా ఏం మాయ చేసావే సినిమాతో అడుగుపెట్టిన సమంత.ఆ సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది.
తన ప్రేమ రహస్యాన్ని బయటికి పెట్టకుండా.వరుసగా సినిమాలపై దృష్టి పెట్టింది.
ఒక స్టార్ హోదాను సొంతం చేసుకున్న సమయంలో.తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది.
నాగచైతన్య కూడా ఇంట్లో ఒప్పించి సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు.పెళ్లి తర్వాత కొంతకాలమైనా కూడా వీరి జీవితం అద్భుతంగా సాగింది.
ఇక సమంతకు మాత్రం బాగా కలిసి వచ్చింది.వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది.
ఇదే కాకుండా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.మొత్తానికి అక్కినేని కోడలుగా ఒక హోదాను సొంతం చేసుకుంది.
"""/" /
కానీ ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది.నాగచైతన్యతో విడాకులు అని అందరికీ షాక్ ఇచ్చింది.
పెళ్లయి నాలుగు సంవత్సరాలు కావోస్తుండగా ఆ సమయంలో తాము విడిపోతున్నాము అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
అంతే ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమంతను టార్గెట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.ఇక వారు విడాకులు తీసుకుని సంవత్సరం అయ్యింది.
అయినా కూడా వీరి విడాకులను జీర్ణించుకోలేకపోతున్నారు తమ అభిమానులు.అయితే తాజాగా సమంత జ్యోతిష్కుడు వేణు స్వామి పై ఫైర్ అయినట్లు తెలుస్తుంది.
ఇటీవల సమంత తన తల్లితో తన బాధను పంచుకుందట.ఆ వేణుస్వామి గాడు ఏ ముహూర్తాన విడాకులు తీసుకుంటామని ముందే అన్నాడో అలాగే జరిగింది.
వాడు అనకపోయి ఉన్నా మేము కలిసి ఉండే వాళ్లం కావచ్చు.వాడి వల్ల మరింత ఎక్కువ పరువుపోయింది అంటూ సమంత చాలా బాధపడుతూ చెప్పుకుందని తెలుస్తుంది.
మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!