అబ్బా సమంత అక్కా .. నీ తెలివికి జోహార్లు

నిజంగా సమంత ని మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి.యశోద సినిమాతో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా చూసిన తర్వాత అందరికీ కలిగిన అనుమానం ఒక్కటే.ఆమె చాలా తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంది.

మరి ఇలాంటి సమయంలో ఇంత రిస్కీగా ఎందుకు డూప్స్ లేకుండా రోపులు కూడా కట్టుకోకుండా ఫైట్ సీన్స్ లలో నటించింది.

అంత అవసరమేముంది అంటే ఖచ్చితంగా ఉంది.ఇక యశోద సమంత విడాకుల తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ఉమెన్ సెంట్రిక్ సినిమా .

ఈ సినిమా వైపు జనాలంతా చూడాలంటే ఏదో బలమైన పాయింట్ కావాలి.సినిమాలో బలం ఎంతో తెలుసుకోవాలంటే అసలు ఆ సినిమాపై ఇంట్రెస్ట్ జనాల్లో కలగాలి.

అందుకే తనకున్న వ్యాధిని ఈ సరిగ్గా సినిమా రిలీజ్ కి ముందు బయట పెట్టింది.

ఇంత వ్యాధిలో సైతం పోరాడుతూనే ఆమె సినిమాలో చాలా అద్భుతంగా నటించింది.సినిమాకి ప్రాణం సమంత మాత్రమే.

కథ ఎలా ఉన్నా, కథనం ఎలా ఉన్నా సమంతా లేకుంటే ఈ సినిమా లేదు.

అంతలా ఈ సినిమా ఆమెపై ఆధారపడి నిర్మాణం జరుపుకుంది.మరి ఆ సినిమా పై ఒక్కసారి నెగిటివ్ టాక్ వచ్చిందా ఇక అంతే.

ఇప్పటికే బీభత్సమైన హీరోయిజానికి అలవాటు పడ్డ మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఇలాంటి ఒక స్లో సినిమాని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని అనుమానంతో తనపై సింపతి క్రియేట్ చేసుకునే పనికి ఓకే చెప్పింది సమంత.

"""/"/ దాంట్లో భాగంగానే డబ్బింగ్ జరుపుతూ సెలైన్ ఎక్కించుకుంటున్నట్టుగా పోస్ట్ పెట్టడం.ఆ తర్వాత యశోద సినిమా ప్రమోషన్స్ సమయంలో కన్నీళ్లు పెట్టడం.

అంతా అనుకున్నట్టుగానే వర్కౌట్ అయింది.ఆమెకి కావాల్సినంత బోలెడు ప్రమోషన్ దొరికిపోయింది.

సినిమా రిలీజ్ అయింది.చూసిన జనాలకి సినిమా కూడా పరవాలేదు అనిపిస్తోంది.

ఇక ఇప్పటికే అక్కినేని వర్గం ఫాన్స్ కి సమంత పెద్ద షాక్ లాంటి విషయం.

ఎందుకంటే ఆమె సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి.పైగా అక్కినేని వారిని ఆమె తన ఎడమ కాలితో తన్నేసింది.

మరి ఈ టైం లో కూడా సమంత విజయం సాధించడం అంటే నిజంగా ఆమె ను మెచ్చుకోకుండా ఉండలేం.

చైతన్య శోభిత తొలిసారి అప్పుడే కలిశారట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?