సమంతను వదలని ఆ ఇద్దరు డైరక్టర్లు…మరో ఛాన్స్ కొట్టేసిన నటి!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 14 ఏళ్ళు పూర్తి అయింది.

ఈ 14 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె ఎన్నో సినిమాలలో నటించింది.టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది సమంత.

హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించింది.ఇక ఓ బేబీ సినిమా మంచి విజయం సాధించింది.

అలాగే సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 హిట్ టాక్ తెచ్చుకుంది.

"""/" / దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ రూపొందించారు.

శ్రీలంక తమిళ్ రెబల్ గా సమంత సాహసోపేత పాత్ర చేసింది.రాజ్ అండ్ డీకే సమంతకు సిటాడెల్ సిరీస్లో( CITADEL ) మరోసారి ఛాన్స్ ఇచ్చారు.

వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేశారు.హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి ఇది ఇండియన్ వెర్షన్.

హనీ బన్నీ అనే టైటిల్ నిర్ణయించారు.పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా త్వరలో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

ఇది ఇలా ఉంటే ముచ్చటగా మూడోసారి రాజ్ అండ్ డీకే హీరోయిన్ సమంతకు ఆఫర్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

రాజ్ అండ్ డీకే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట.

"""/" / ఈ సిరీస్లో ఆదిత్య రాయ్ కపూర్( Aditya Roy Kapur ) హీరోగా నటిస్తుండగా సమంత హీరోయిన్ అట.

ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సిరీస్ కి రక్తబీజ్ అనే టైటిల్ నిర్ణయించారట.

త్వరలో అధికారిక సమాచారం రానుండగా ఆల్రెడీ సమంత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందట.ఆమె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారట.

ఈ సిరీస్ సమంత కెరీర్ కి మరింత బూస్ట్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

ఫ్యూచర్ డిజిటల్ కంటెంట్ దే.భవిష్యత్ లో స్టార్ హీరోలు కూడా సిరీస్లు, ఒరిజినల్స్ చేయక తప్పదు.

సమంత ఆ దిశగా అడుగులు వేస్తోంది.అలాగే సమంత మా ఇంటి బంగారం టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది.

ఈ చిత్రానికి ఆమె నిర్మాత కూడా.కాగా ఖుషి సినిమా తర్వాత దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.