సమంత నెగటివ్ ట్రీట్ ఈ ఏడాదిలో లేనట్లే
TeluguStop.com
సమంత హీరోయిన్‌గా ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించింది.అన్ని సినిమాల్లో కూడా సమంత పాజిటివ్‌గానే కనిపించింది.
ఏ ఒక్క సినిమాలో కూడా కనీసం కొన్ని సీన్స్‌లో అయినా నెగటివ్ షేడ్స్ లో కనిపించలేదు.
సమంతను నెగటివ్ షేడ్స్‌లో చూడటం కష్టం అని ఆమెను ఇలా అందంగా పాజిటివ్‌గానే చూడాలని భావిస్తున్నాం అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు అంటున్నారు.
కాని ఆమె మాత్రం తనకు పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో నెగటివ్ రోల్ చేసింది.
కాని అది సినిమాలో కాదు.ఒక వెబ్ సిరీస్ లో అనే విషయం అందరికి తెల్సిందే.
ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో పాకిస్తానీ అమ్మాయిగా నెగటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా సమంత నటించిందనే విషయం చాలా రోజులుగా వస్తున్నాయి.
ఎప్పుడు లా కాకుండా ఈసారి కాస్త విభిన్నంగా అంటూ సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లోని పాత్ర గురించి చెప్పుకొచ్చింది.
ముందు నుండి అనుకుంటున్నదాని ప్రకారం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ లో డిసెబర్ లో స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది.
కాని వెబ్ సిరీస్ పై ఉన్న అంచానాల నేపథ్యంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిర్మాణానంతర కార్యక్రమాలను చాలా జాగ్రత్తగా మెల్లగా చేస్తున్నారు.
అందుకే వెబ్ సిరీస్ ఆలస్యం అవుతుంది.మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ కు అత్యంత ప్రేక్షకాధరణ లభించడం ఖాయం అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
తప్పకుండా ఇదో ఉత్తమ వెబ్ సిరీస్ గా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ తో ఉత్తరాది ప్రేక్షకులకు సమంత చేరువ అవుతుందనే నమ్మకం కలుగుతోంది.
సమంత నెగటివ్ షేడ్స్ లో కనిపించిన వెబ్ సిరీస్ కోసం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాని అది మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది.అన్ని అనుకున్నట్లుగా అయితే వచ్చే ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
వివేక్ ఆత్రేయ నెక్స్ట్ సినిమా ఏ హీరో తో చేస్తున్నాడో తెలుసా..?