హనీ బన్నీ సిరీస్ కోసం షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్న సమంత… ఎన్ని కోట్లో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ఏడాది పాటు విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.

తన వ్యక్తిగత కారణాల వల్ల ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన ఈమె ప్రస్తుతం తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు ఈమె నటించిన హనీ బన్నీ( Honey Bunny ) వెబ్ సిరీస్ ప్రమోషన్లలో కూడా బిజీ గా మారుతున్నారు.

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్( Varun Dhawan ) సమంత జంటగా రాసిన డీకే డైరెక్షన్లో తెరకెక్కిన హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ నవంబర్ 27వ తేదీ నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానుంది.

"""/" / ఇటీవల ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు ఇక ఇందులో భాగంగా సమంత మరోసారి తన యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టిందని చెప్పాలి.

ఇలా ఈ సిరీస్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అందుకోసం సమంత భారీ స్థాయిలో కష్టపడిందని స్పష్టంగా తెలుస్తుంది.

ఇలా ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతో కష్టపడిన సమంత రెమ్యూనరేషన్ ( Remuneration ) కూడా అదే స్థాయిలో తీసుకున్నారని సమాచారం.

ఈ ఒక్క వెబ్ సిరీస్ కోసం ఈమె ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

"""/" / సమంత ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

కానీ ఈ ఒక్క వెబ్ సిరీస్ చేయడం కోసం ఈమె ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ నటి కూడా బాలీవుడ్లో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని తెలుస్తుంది.

ఇక నయనతార కూడా జవాన్ సినిమాకి ఎనిమిది నుంచి పది కోట్లు తీసుకున్నారు కానీ సమంత మాత్రం వెబ్ సిరీస్ కే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇక సమంత సైతం తన కెరీర్లో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అని తెలుస్తుంది.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..