మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత… ఎమోషనల్ పోస్ట్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సమంత( Samantha ) ఒకరు.
అయితే ఇటీవల కాలంలో సమంత తన స్పీడ్ కాస్త తగ్గించింది.అందుకు గల కారణం తన వ్యక్తిగత విషయాలనీ చెప్పాలి.
సమంత నాగచైతన్య( Naga Chaitanya ) నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంది.
పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈమె ఆ డిప్రెషన్ నుంచి బయటపడుతూ సినిమాలకు కమిట్ అయ్యారు .
అయితే ఈ సినిమాలో షూటింగ్ సమయంలోనే మయోసైటీసిస్( Myositis ) వ్యాధికి గురి అయ్యారు.
ఇక ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
"""/" /
ఇక ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోరుకున్న ఈమె తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలోనే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా కమిట్ అయ్యారు తప్ప వాటి గురించి ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు.
ఈమె చివరిగా ఖుషి సినిమా( Khusi Movie ) ద్వారా వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా వెండి తెరకు గత కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
"""/" /
తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ చూస్తే మాత్రం ఈమె మరో వ్యాధికి గురయ్యారని తెలుస్తోంది.
ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న పిక్‌ను షేర్ చేసింది.
చికెన్ గున్యా( Chicken Gunya ) వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటుందంటూ ఒక సాడ్ ఎమోజిని షేర్ చేశారు.
దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత చికెన్ గునియా వ్యాధితో బాధపడుతున్నారా అంటూ అభిమానులు కంగారు వ్యక్తం చేయడమే కాకుండా తనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కామెంట్లు చేస్తున్నారు.
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది… ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!