శుభం మూవీ ట్రైలర్ రివ్యూ.. సమంత నిర్మించిన తొలి సినిమా ట్రైలర్ వేరే లెవెల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై తొలి సినిమాగా శుభం( Shubham Movie ) అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.సీరియల్ పిచ్చి ఉన్న భార్యలు తర్వాత దెయ్యాలుగా మారితే ఆ భార్యల వల్ల భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

మేకర్స్ ట్రైలర్ లో కామెడీకి పెద్ద పీట వేయడం గమనార్హం.ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సమంత ఈ సినిమాలో మాతాజీగా కనిపించారు.

హర్రర్ కామెడీ( Horror Comedy ) కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా మే నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

ట్రైలర్ లో డైలాగ్స్ సైతం ఆకట్టుకున్నాయి.సమంత లుక్స్ బాగుండటం ట్రైలర్ కు ప్లస్ అయింది.

శుభం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతుందేమో చూడాల్సి ఉంది. """/" / శుభం సినిమాకు పెద్దగా బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా లేదు.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సమంత రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ సినిమాలను నిర్మించే ఛాన్స్ ఉంది.

ఈ మధ్య కాలంలో హర్రర్ కామెడీ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండగా శుభం సినిమా ఓటీటీ హక్కులకు సైతం భారీ స్థాయిలో డిమాండ్ నెలకొందని సమాచారం అందుతోంది.

"""/" / శుభం సినిమా బిజినెస్ విషయంలో సైతం అదరగొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.

శుభం సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని సమంత ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ సినిమాకు అక్కినేని అభిమానుల సపోర్ట్ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.

అక్కినేని హీరోలు సైతం కెరీర్ పరంగా ఒకింత వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సమంత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.