ఆ హీరోకి చుక్కలు చూపించిన సమంత... మీరే నాశనంచేసారన్న హీరో... అసలేం జరిగిందంటే?
TeluguStop.com

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.


తాజాగా నటించిన అద్భుతం చిత్రం ఎంతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.


ఈ క్రమంలోనే తేజ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా హీరో తేజ సమంత మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది ఓ బేబీ సినిమా ద్వారా ఈ పరిచయం ఏర్పడి వీరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని చెప్పవచ్చు.
అప్పటినుంచి ఈ యంగ్ హీరోకి సమంత డైరెక్టర్ నందిని రెడ్డి ఎంతో సపోర్ట్ గా నిలబడ్డారు.
ఇదిలా ఉండగా తాజాగా తేజ సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేస్తూ.
ఎక్స్ క్యూజ్ మీ లేడీస్` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.ఆ పోస్ట్ చూసిన సమంత ఈ హీరోకి చుక్కలు చూపించింది.
ఈ పోస్ట్ పై స్పందించిన సమంత 'అంటే? ఒక్క చిత్రం కోసం ఆహ్.
అంత ఈజీ అనుకున్నావా? మనం అతనికి ఏమీ నేర్పించలేదా?' అంటూ డైరెక్టర్ నందిని రెడ్డిపై సరదాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
"""/" /
నందిని రెడ్డి నవ్వుతూ ఉన్నటు వంటి ఎమోజీలను షేర్ చేశారు.
ఈ విషయంపై హీరో తేజ ' మీరు నా మొత్తం స్వాగ్ ని నాశనం చేసారని' ఫీల్ అవుతూ కామెంట్ పెట్టాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేయడంతో తేజ ను సమంత సరదాగా ఓ ఆట ఆడుకుంది.
ఈ రాగి డ్రింక్ తో నీరసానికి చెప్పండి బై బై..!