ఓడిపోతే కొత్త ప్రయాణం మొదలుపెట్టు… ఓటమి గురించి ఆలోచించకు: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Sanantha ) వృత్తి పరమైన జీవితంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొంటున్నారు.

ఈమె నటుడు నాగ చైతన్యను ( Nagachaitanya )ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనంతరం విడాకులు( Divorce ) డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం వంటి ఇబ్బందులు పడ్డారు.

ఇలా డిప్రెషన్ నుంచి బయట పడగానే సమంత మయోసైటిసిస్ వ్యాధికి గురి అయ్యారు.

ఇలా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన ఈమె ఎంతో ధైర్యంగా నిలదొక్కుకొని తిరిగి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

"""/" / ఈ విధంగా వ్యక్తిగత జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.

ఈమె ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృంగిపోకుండా తిరిగి లేచి నిలబడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

ఇక కెరియర్ పరంగా బిజీగా ఉంటున్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ అందరికి ఎంతో స్ఫూర్తినిచ్చే కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ మిమ్మల్ని అందరూ నిందిస్తున్నప్పుడు మీరు తలెత్తుకొని నిలబడితే.

పురుషులందరూ మిమ్మల్ని అవమానించినప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకొని నిలబడితే అంటూ సాగిపోయే ఒక పద్యాన్ని షేర్ చేశారు.

"""/" / ఇక ఈ పద్యాన్ని ఈమె షేర్ చేస్తూ దీనిని మీ అందరితో పంచుకోవాలని ఉందనే క్యాప్షన్ కూడా పెట్టారు.

మన విజయాలని పక్కనపెట్టి ఒక్కసారిగా రిస్క్ చేస్తున్నప్పుడు ఓడిపోతే ఓటమి గురించి ఆలోచించకుండా మరొక కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి.

మనం మరింత కఠినంగా మారి సుదీర్ఘ ప్రయాణం కోసం ముందుకు కదలాలి .

మన దగ్గర ఏమీ లేనప్పుడు సంకల్పబలం అనేదాన్ని గట్టిగా పట్టుకుంటే మనల్ని నిందించే వారికి సరైన సమాధానం చెప్పగలం అంటూ ఈమె స్ఫూర్తిదాయకమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. పెళ్లి జరిగేది అప్పుడేనా?