సమంత ‘శాకుంతలం’ ప్రమోషన్ కోసం గుణశేఖర్ ఖర్చు చేస్తున్నది ఎంత?

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఎదురు చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా యొక్క ట్రైలర్‌ అంచనాలు మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు.

"""/"/సమంత ప్రధాన పాత్ర అవ్వడంతో పాటు పౌరాణిక సినిమా అవ్వడం వల్ల అందరి చూపు ఈ సినిమాపై ఉంది.

సినిమా పై ఎంతగా ఆసక్తి ఉన్నా.అంచనాలు ఉన్నా కూడా ప్రమోషన్‌ విషయంలో ఫిల్మ్‌ మేకర్స్ అలసత్వం చూపించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.

శాకుంతలం సినిమా ప్రమోషన్ విషయంలో దర్శకుడు గుణశేఖర్‌ యాక్టివ్‌ గా లేడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

దర్శకుడు గుణశేఖర్‌ ఇప్పటికే ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది.ట్రైలర్ విడుదలకు ఒక ప్రెస్ మీట్‌ ఏర్పాటు చేశాడు.

ఆ తర్వాత రెండు పాటలను విడుదల చేశాడు.అంతకు మించి ఏం చేయడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.

రాజమౌళి సినిమాకు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.అయినా కూడా ఆయన కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తాడు.

ఆయన ప్రమోషనల్ ఈవెంట్స్ సినిమా పై అంచనాలు పెంచుతూనే ఉంటాయి.కానీ గుణశేఖర్ మాత్రం అలా చేయడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.

"""/"/ గుణశేఖర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను దిల్‌ రాజు సమర్పిస్తున్నాడు.దిల్‌ రాజు అయినా ఈ సినిమా యొక్క పబ్లిసిటీ పై దృష్టి పెట్టడం లేదు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు భారీ బడ్జెట్‌ తో శాకుంతలం సినిమాను నిర్మించిన దర్శకుడు గుణశేఖర్‌ పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు చేస్తున్నాడు అంటూ సమంత అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters