యశోద తో పోలిస్తే శాకుంతలం కలెక్షన్స్ పరిస్థితి ఏంటి..?
TeluguStop.com
సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్ ( Guna Shekhar )దర్శకత్వం లో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన శాకుంతలం చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
వీకెండ్స్ లో పరవాలేదు అన్నట్లుగా గౌరవ ప్రధమైన కలెక్షన్స్ నమోదు చేసిన శాకుంతలం( Shakuntalam )చిత్రం సోమవారం నుండి దారుణమైన కలెక్షన్స్ ని నమోదు చేస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమా అత్యంత దారుణమైన డిజాస్టర్ గా నిలవబోతుందని కూడా సోమవారం నాటి కలెక్షన్స్ ని చూస్తుంటే అనిపిస్తోంది అని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సమంత గత చిత్రం యశోద( Yashoda ) తో పోలిస్తే ఈ సినిమా మరీ డిజాస్టర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఈ స్థాయిలో డిజాస్టర్ గా ఈ సినిమా నిలవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
సమంత యశోద సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని నమోదు చేయడం జరిగింది.
ఓవర్సీస్ లో కూడా యశోద చిత్రం మంచి కలెక్షన్స్ ని రాబట్టింది, కాని శాకుంతలం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరియు విదేశాల్లో ఎక్కడ కూడా ఒక మోస్తరు కలెక్షన్స్ ని కూడా రాబట్ట లేకపోవడం విచారకరం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడు గుణశేఖర్ అత్యుత్సాహం తో గ్రాఫిక్స్ విషయం లో అతి జాగ్రత్త తీసుకున్న కూడా ఆమీర్ పేట్ గ్రాఫిక్స్ అన్నట్లుగానే వచ్చాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకుడు గుణశేఖర్ గ్రాఫిక్స్ విషయాన్ని పక్కన పెట్టి మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తీస్తూ కెరియర్ లో ముందుకు సాగాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
యశోద సినిమా తో పోలిస్తే శాకుంతలం సినిమా కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా రిపోర్టు అందుతుంది.
దిల్ రాజు సమర్పించినా కూడా శాకుంతలం ను జనాలు పట్టించుకోవడం లేదు.
రాత్రి 11 అయినా భోజనం లేదు.. భారతీయ విందులపై అమెరికన్ షాకింగ్ కామెంట్స్!