Samantha : రెండేళ్లు వెంటపడ్డాడు.. ఫస్ట్ లవ్ పై ఓపెన్ అయిన సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే .

ఈమె మయోసైటీసిస్ వ్యాధికి గురి కావడంతో ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు.

ఇలా సినిమాలకు దూరమైనటువంటి సమంత వివిధ దేశాలకు వెళ్తూ అక్కడ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడ్డారని తెలుస్తోంది.

ఇక త్వరలోనే సమంత తిరిగి సినిమాలలోకి రాబోతున్నారని సమాచారం. """/" / ఈ విధంగా సమంత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

అయితే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా తన ఫస్ట్ లవ్ గురించి పలు విషయాలను వెల్లడించారు.

సమంత ఫస్ట్ లవ్ ( First Love ) నాగచైతన్య( Nagachaitanya ) కాదని అంతకంటే ఓ వ్యక్తిని ఈమె ప్రేమించిందని రెండు సంవత్సరాల పాటు ఆ వ్యక్తి తన వెంట పడ్డారు అంటూ సమంత తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / సమంత తన ఫస్ట్ లవ్ గురించి చెబుతూ.చదువుకునే రోజుల్లో పల్లవరం నుండి టీనగర్ వెళ్ళడానికి రెండు బస్సులు మారాల్సి వచ్చేదట.

ఒక అబ్బాయి రోజూ సమంత కోసం బస్ స్టాప్ వద్ద వెయిట్ చేసేవాడట.

ఈ విధంగా అబ్బాయి తన స్కూల్ వరకు తనని ఫాలో అయ్యే వారిని స్కూల్ కి కొంచెం ముందు ఆగి తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవాడని తెలిపారు.

అయితే ఏ రోజు కూడా అబ్బాయి తన వద్దకు రాలేదని సమంత తెలిపారు.

ఇలా రెండు సంవత్సరాల పాటు పిచ్చోడిలా తిరిగాడని అయితే ఒకరోజు ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావా అని అడిగితే నిన్ను ఫాలో చేయడమేంటి అని చెప్పాడు దీంతో ఒక్కసారిగా నేను షాక్ అయ్యానని సమంత తెలిపారు.

మరి దానిని లవ్ అంటారా లేదా అనే విషయం నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫస్ట్ లవ్ అదే అంటూ సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?