Samantha : ఫైనల్లీ గుడ్ న్యూస్ చెప్పిన సమంత… ఆ విషయం నాకు తెలుసు అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత( Samantha )ఒకరు.
ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దాదాపు పుష్కర కాలం పాటు తన సినీ కెరియర్ పూర్తి చేసుకున్నారు.
అయితే ఇటీవల కాలంలో సమంత తన అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి కొంత విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మయోసైటిస్ ( Myositis ) అనే వ్యాధితో బాధపడుతున్నటువంటి తరుణంలో ఈమె ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు దీంతో ఇండస్ట్రీకి విరామం ఇచ్చేశారు.
"""/" /
ఇలా విరామం తీసుకున్నటువంటి సమంతా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.
ఈమె ఈ మయోసైటిస్ చికిత్స కోసం ఎన్నో దేశాలకు వెళుతూ ఎన్నో రకాల చికిత్సలను చేయించుకున్నారు.
ఇలాఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత ఎన్ని ప్రయత్నాలు చేశారో వాటన్నింటిని కూడా అభిమానులతో పంచుకున్నారు.
"""/" /
ఇకపోతే ఈమె మయోసైటిస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈమె తిరిగి సినిమాలలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే సమంత తన సినీ రీఎంట్రీ ( Re Entry) గురించి సోషల్ మీడియా వేదికగా తాజాగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను సమంత పోస్ట్ చేశారు.
త్వరలో షూటింగ్స్‌లలో పాల్గొంటున్నట్లు అందులో అధికారికంగా ప్రకటించారు. """/" /
ఇప్పటికే చాలామంది అభిమానులు నన్ను తిరిగి ఎప్పుడు సినిమాలలోకి రాబోతున్నారని అడుగుతున్నారని ఆ విషయం నాకు తెలుసు ఫైనల్లీ ఆ సమయం వచ్చేసింది.
త్వరలోనే తాను సినిమా పనులలో బిజీ కాబోతున్నానని తెలిపారు.ఇక నాకు అనారోగ్యం చేయటంతో నా స్నేహితులతో కలిసి నేను ఆరోగ్య పోడ్‌కాస్ట్‌పై ఒక కార్యక్రమం చేశాం.
త్వరలో దానికి సంబంధించిన వీడియో విడుదల అవుతుందని ఈ సందర్భంగా సమంత తెలిపారు.
తాజాగా ఈమె షేర్ చేసినటువంటి ఈ వీడియోలో ఎరుపు రంగు డ్రెస్ వేసుకొని ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్ లో కనిపించారు.
ఇలా సమంతకి సమయం ఆసన్నమైందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇకపై కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగబోతున్నారనే విషయం మనకు తెలిసిందే.
వైరల్ వీడియో: బహిరంగంగా రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన యువత..