టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆ హీరోయిన్ అంటే ఇంత అభిమానమా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు రాణిస్తున్నారు.వారిలో కొందరు ప్రస్తుతం చేతుల్లో వరుస అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతుండగా మరికొందరు సరేనా అవకాశాలు లేక మూవీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

మాములుగా అభిమానులు మా హీరోయిన్ గొప్ప మా హీరోయిన్ గొప్ప అంటూ గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.

కానీ టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం చెప్పలేరు.కానీ తాజాగా సర్వేలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.

మరి ఆ వివరాల్లోకి వెళితే.ప్రముఖ మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరో వెల్లడించింది.

"""/" / మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ తెలుగు పేరుతో ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి.

మరి ఆ వివరాల్లోకి వెళితే.కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి( Anupama Parameswaran ) 10వ స్థానంలో నిలిచింది.

టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ అమ్మడుకి టాప్ టెన్ లో చోటు దక్కింది.

ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డే ( Pooja Hegde ) 9వ ర్యాంక్ కి పడిపోవడం అనూహ్య పరిణామం.

పూజ హెగ్డే తెలుగులో నటించి రెండేళ్లు కావస్తుంది.బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో ఆమె ఫేమ్ పూర్తిగా పడిపోయింది.

అలాగే ప్రస్తుతం ఫామ్ లో లో ఉన్న హీరోయిన్స్ లో కీర్తి సురేష్( Keerthy Suresh ) కూడా ఒకరు.

"""/" / ఆమె 8వ స్థానంతో సరిపెట్టుకోవడం అనూహ్య పరిణామం.గత ఏడాది కీర్తి సురేష్ దసరా, భోళా శంకర్ చిత్రాల్లో నటించింది.

అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా( Tamanna ) 7వ స్థానంలో నిలిచింది.ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న తమన్నా ఫేమ్ తగ్గింది.

రష్మిక మందాన( Rashmika Mandanna ) కనీసం టాప్ 5లో లేకపోవడం అనూహ్య పరిణామం.

యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక మందన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆమెకు 6వ స్థానం దక్కింది.హీరోయిన్ సాయి పల్లవి( Sai Pallavi ) తెలుగులో సినిమా చేసి చాలా కాలం అవుతున్నా ఆమె ఫేమ్ తగ్గలేదు.

పల్లవి 5వ స్థానంలో నిలిచింది. """/" / అలాగే కన్నడ భామ శ్రీలీల ( Sreeleela ) 4వ స్థానంలో నిలిచి సత్తా చాటింది.

ఆమె ఖాతాలో ప్లాప్స్ ఎక్కువగా ఉన్నా యూత్ లో క్రేజ్ తగ్గలేదు.టాప్ 5లో చోటు దక్కించుకుంది.

అనుష్క శెట్టి( Anushka Shetty ) 3వ స్థానంలో నిలిచింది.అదేవిధంగా పెళ్లయ్యాక కాజల్ జోరు తగ్గింది.

గత ఏడాది భగవంత్ కేసరి మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది.

ఫామ్ లో లేని కాజల్ కి( Kajal ) జనాలు 2వ స్థానం కట్టబెట్టారు.

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ కిరీటం సమంతకు( Samantha ) దక్కింది.నిజానికి సమంత కూడా ఫామ్ లో లేకపోయినప్పటికీ సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్ అని జనాలు కన్ఫర్మ్ చేశారు.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!