పుష్పలో సమంతా ఐటెం సాంగ్.. పాడింది ఎవరో తెలుసా?

తెలుగు దర్శకులంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై లుక్కేశారు.ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా రేంజిలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

రాజమౌళి త్రిఫుల్ ఆర్, పూరీ జగన్నాథ్ లైగర్ తెరకెక్కిస్తుండగా.సుకుమార్ పుష్ప సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతోంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.ఆయన ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపిస్తున్నాడు.

అటు అల్లు అర్జున్​ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే కావడం విశేషం.

ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అటు ఈ సినిమాలో నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందాన హీరోయిన్ గా చేస్తుంది.

అటు సుమారు పుష్కర కాలం తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలిసి ఈ సినిమాను చేస్తున్నారు.

దీంతో జనాల్లో ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.ఈ నెల 17న ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ తో పాటు పాటలకూ మంచి రెస్పాన్స్ వస్తుంది.

"""/" / అటు ఈ సినిమాలో సమంత ఓ ఐటెం సాంగ్ చేస్తుంది.విడాకుల తర్వాత తన నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది.

సమంత అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఓ అంటావా ఓ ఓ అంటావా అనే సాంగ్​ విడుదల కాబోతుంది.

అయితే ఈ పాటతో ఓ కొత్త సింగర్ సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతుంది.

"""/" / తన పేరు ఇంద్రావతి.ఈమె మరెవరో కాదు.

సింగర్ మంగ్లీ సిస్టర్.ఈమె ఇప్పటికే పలు పాటలు పాడింది.

జార్జిరెడ్డి సినిమాలో కూడా ఓ పాట పాడింది.కానీ కొన్ని కారణాల మూలంగా బయటకు రాలేదు.

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పలో తన గొంతు వినిపించబోతుంది.

ఆస్కార్‌ రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ‘కంగువా’