తెలంగాణ ఎంసెట్ ర్యాంకర్ ను మెచ్చుకున్న సమంత.. నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) స్కూల్, కాలేజ్ లో చదివే సమయంలో టాపర్ అనే సంగతి తెలిసిందే.

చదువులో ప్రతిభ చూపే విద్యార్థులను ప్రశంసించే విషయంలో సైతం సమంత ముందువరసలో ఉంటారు.

గత కొంతకాలంగా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సమంత సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు.

తాజాగా ఒక విద్యార్థినిపై సమంత ప్రశంసల వర్షం కురిపించారు.కొన్నిరోజుల క్రితం పదో తరగతి టాపర్ ను అభినందించిన సమంత తాజాగా తన అభిమాని, ఎంసెట్ టాప్ ర్యాంకర్( Eamcet Top Ranker ) అయిన అమ్మాయిని మెచ్చుకున్నారు.

తనకు వీరాభిమాని అయిన అమ్మాయి తెలంగాణ ఎంసెట్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడంతో సమంత ఆ విద్యార్థినితో కలిసి ఫోటో దిగడంతో పాటు ఆ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది.

"""/" / "నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్" అంటూ ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

సమంత నుంచి ప్రశంసలు దక్కడం అంటే మామూలు విషయం కాదని ఆ విద్యార్థిని చాలా లక్కీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమంత కెరీర్ ప్లానింగ్స్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

"""/" / సమంతకు ఇతర భాషల నుంచి సైతం భారీ స్థాయిలోనే ఆఫర్లు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సమంత రీఎంట్రీ మూవీ సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతోందని తెలుస్తోంది.మా ఇంటి బంగారం( Maa Inti Bangaram ) అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? ఇతర విషయాలకు సంబంధించి సమాధానాలు తెలియాల్సి ఉంది.

సమంత ఇటీవల ఆర్మాక్స్ సర్వేలో టాప్ లో నిలిచిన సంగతి తెలిసిందే.

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రాలు రెడీనా ?