కర్నూలు విద్యార్థినిపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ సమంత.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్‌ ( Citadel Web Series )లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా గత ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించిన సామ్ ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి కారణంగా దాదాపు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి భారీ నుంచి నెమ్మదిగా కోలుకుంటూ రీ ఎంట్రీ ఇవ్వడానికి గట్టిగానే కృషి చేస్తోంది.

"""/" / అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో తరచూ ఏదోక విషయంతో వార్తలు నిలిచడంతో పాటు గ్లామర్ ఫోటోస్ తో యువతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది హీరోయిన్ సమంత( Samantha ).ఇంటర్‌ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించింది.

ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నిర్మలను( Nirmala ) పొగడ్తలతో ముంచేత్తుంది.ఈ రోజుల్లో తనే నాకు ఆదర్శం అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

అంతే కాకుండా ప్రముఖ పత్రిక క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.స్టార్ హీరోయిన్‌ సమంత ఇంటర్‌ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించడంతో సామ్ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇటీవల రిలీజైన ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో ఆలూరు కేజీబీవీలో చదివిన ఎస్ నిర్మల బైపీసీలో 440 కి 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.

"""/" / బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది.అంతేకాదు ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అంతే కాదు నిర్మల పదో తరగతిలోనూ 537 మార్కులు సాధించింది.అయితే నిరుపేదలైన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలు అయ్యాయి.

ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్న తనంలోనే వివాహం చేయాలని భావించారు.

కానీ చదువుకోవాలి అన్న పట్టుదలతో పోరాడి బాల్య వివాహం నుంచి తప్పించుకుంది.ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుందినిర్మల.

కేరళలో అల్లు అర్జున్ కు మాత్రమే ఈ స్థాయిలో క్రేజ్ ఉండటానికి కారణాలివేనా?